Kangana Ranaut: స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయా, దాని వల్ల తమ కెరీర్ ఎప్పుడెప్పుడు ఎదుగుతుందా అని ఎదురుచూస్తుంటారు కొందరు హీరోయిన్లు. కానీ స్టార్ హీరోల సినిమా అంటే చాలావరకు హీరోయిన్లకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అది తెలిసి కూడా ఒప్పుకునే నటీమణులు ఉన్నారు. కానీ కంగనా రనౌత్ అలా కాదు.. బాలీవుడ్ అంతా ఒకవైపు అయితే.. తాను మాత్రం ఒకవైపు అన్నట్టుగా ఉంటుంది కంగనా ప్రవర్తన. హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుండి ఏ స్టార్ హీరో సినిమా మీద ఆధారపడకుండా తనంతట తానుగా కెరీర్‌ను మలుచుకున్న కంగనా.. అసలు సల్మాన్ ఖాన్‌తో ఇప్పటివరకు ఎందుకు నటించలేదో రివీల్ చేసింది.
సల్మాన్ మాత్రం ఓకే
మామూలుగా కంగనా రనౌత్‌కు స్టార్ హీరోలంటే నచ్చరు. ఈ విషయాన్ని చాలాసార్లు ఓపెన్‌గానే చెప్పేసింది. అందుకే తనకు ఎవరూ ఆఫర్లు ఇవ్వడానికి కూడా ముందుకు రారు. అది తన కెరీర్‌పై పెద్దగా ఎఫెక్ట్ పడనివ్వకుండా తానేంటో నిరూపించుకుంటూ వచ్చింది కంగనా. కానీ మిగతా స్టార్ హీరోలతో పోలిస్తే సల్మాన్ ఖాన్ (Salman Khan)పై కంగనాకు పాజిటివ్ ఒపీనియనే ఉంది. ఈ విషయాన్ని కూడా తను పలుమార్లు బయటపెట్టింది. మిగతా స్టార్ హీరోల గురించి మాట్లాడినంత నెగిటివ్‌గా సల్మాన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కంగనా. తనతో నటించాలని లేదని కూడా ఎప్పుడూ చెప్పలేదు. కానీ కలిసి నటించాలని అనుకున్నా కూడా ఇప్పటివరకు సందర్భం రాలేదని తాజాగా బయటపెట్టింది.
Also Read: హృతిక్ కెరీర్‌లోనే అదిపెద్ద తప్పు.. రూ.13 వేల కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన సినిమా రిజెక్ట్
సందర్భం రాలేదు
‘‘సల్మాన్ నాకు మంచి స్నేహితుడు. మేము కలిసి పనిచేయడానికి చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఎందుకో ఆ సందర్భం ఇంకా రాలేదు’’ అని తెలిపింది కంగనా రనౌత్. ఇంతకు ముందు కూడా సల్మాన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘సల్మాన్ ఖాన్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనను ప్రేమించే వారు ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. ఆయనను ఇష్టపడనివారు కచ్చితంగా ద్వేషిస్తారు. వారి దృష్టిలో ఆయన చిరాకుగా కూడా కనిపిస్తారు. ఎవరైనా వచ్చి సల్మాన్ ఖాన్ ఆ పొజిషన్‌కు ఎలా చేరుకున్నాడని తన హేటర్స్‌ను అడిగితే కచ్చితంగా వారికి కోపమొస్తుంది’’ అని ఒక ఈవెంట్‌లో మాట్లాడింది కంగనా రనౌత్.
ఫుల్ ఖుషీ
ఇక సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం కంగనా రనౌత్ (Kangana Rananut) తన అప్‌కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. గత రెండేళ్లుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడుతోంది కంగనా. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌గా తెరకెక్కిన ఈ మూవీని స్వయంగా కంగనానే డైరెక్ట్ చేసింది. ప్రధాన మంత్రిగా ఇందిరా గాంధీ చివరి రోజుల్లో అసలు ఏం జరిగిందో ఈ సినిమా ద్వారా చెప్పనుంది. ఒక ప్రముఖ రాజకీయ నాయకురాలి బయోపిక్ కాబట్టి ఈ మూవీ రిలీజ్‌ను చాలామంది అడ్డుకున్నారు. ఫైనల్‌గా ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ జనవరి 17న ‘ఎమర్జెన్సీ’ (Emergency) విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో కంగనా ఫుల్ ఖుషీలో ఉంది.