Gundeninda GudiGantalu Today episode January 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. రవి, శృతిలు కొత్త జంటలకు హారతి ఇచ్చిన తర్వాత ప్రభావతి కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మని ప్రభావతి శృతికి చెబుతుంది. కుడికాలు ఏంటి.. ఎడమకాలి ఏంటి.. రెండు కాళ్లు నావే కదా.. అంటూ ప్రభావతికి తింగరి సమాధానం ఇస్తుంది శృతి. మరోవైపు బాలు తన రూమ్ నుండి అరుస్తాడు. దీంతో మీనా వెంటనే వెళ్లి బాలు రూమ్ లాక్ ఓపెన్ చేస్తుంది.. బాలు వస్తే ఎంత పెద్ద గొడవ చేస్తాడు అని ఇటు సత్యం అటు ప్రభావతి టెన్షన్ పడుతుంటారు. నన్ను రూమ్లో పెట్టి లాక్ ఎవరు చేశారు? అయినా ఇంట్లో హడావిడి ఏంటి? ఎవరు వచ్చారు? అని మీనాను ప్రశ్నిస్తాడు బాలు. రవి, శృతి ఇంటికి వచ్చారని చెప్పగానే బాలు ఆవేశం కట్టలు పెంచుకుంటుంది. ఎవర్రా ఇంటికి రమ్మని చెప్పింది. ఇంట్లో ఎలా కాలు పెట్టావు ? అంటూ రవిని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. దీంతో శృతి అడ్డుపడుతుంది. బాలుకి శృతి వార్నింగ్ కూడా ఇచ్చేస్తుంది.. ఇక సత్యం ప్రభావతి ఇద్దరూ ఆపుతారు. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోతారు.. శృతిని దీపం వెలిగించమని ప్రభావతి అంటుంది. ఇంట్లో ఎంత వెలుగు ఉండగా.. లైట్లు ఉండగా.. దీపం ఎందుకు పెట్టాలి అంటుంది శ్రుతి. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత మీనా దీపం ఎందుకు పెట్టాలో అసలు విషయం చెబుతుంది. ఇలా మొత్తానికి ప్రభావతి కల నెరవేరుతుంది. శృతి ఇంట్లోకి అడుగుపెట్టగానే ప్రభావతి తన గొప్పలు చెప్పుకుంటుంది. మీ ఇంట్లో మీరు ఇంట్లోకి రావడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా అని అనగానే శృతి మీరేం కష్టపడ్డారు ఆంటీ అంతా మీనా వల్లే కదా జరిగింది అని ప్రభావతి గాలి తుస్సున తీసేస్తుంది.. మీనా లేకపోతే నేను మీ ఇంట్లో అడుగు పెట్టే దాన్ని కాదు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లోకి శృతికి రాగానే అందరు సంతోషంగా ఉంటుంది. మీనా ను తన ముందే పొగడడంతో ప్రభావతి కుళ్ళుకుంటుంది. ఇదేంటి వస్తూనే నా గుప్పెట్లో పెట్టుకోవాలని నేను అనుకుంటే మీ నాకు కనెక్ట్ అవుతుంది అని ప్రభావతి మనసులో అనుకుంటుంది. ఇక మీనా శృతి లు బాగా క్లోజ్ అయిపోతారు. బాలు ఏం చేయలేక వెళ్ళిపోతాడు. రాజేశ్వరి ఈ విషయాన్ని చెప్పి బాధపడతాడు.. ప్రభావతి బాలుని ఆపే ప్రయత్నం చేస్తుంది.. సత్యం చెప్పడంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు బాలు.. అవమానించిన పెద్దమనిషి ఎక్కడ మా నాన్న ఆరోగ్యాన్ని దెబ్బతీసిన పెద్దమనిషి ఎక్కడ మొహం చల్లగా బయట ఉండిపోయాడా లేదా ఎక్కడైనా రూముల్లో దాచి పెట్టారా అని అడుగుతాడు. మా డాడ్ బయటే ఉన్నాడు ఇంట్లోకి రానని చెప్పాడు అని అంటుంది శృతి. అలాగే సత్యం నేను వెళ్లి పిలిచాను కానీ ఇంట్లోకి రాలేదు అది ఆయన మర్యాదగా వదిలేస్తున్నాను అని అంటాడు. ఇక శోభా వింటూ ఉంటే భోజనం చేసి వెళ్లండి వదిన గారు అని ఉంటుంది ప్రభావతి. ఈవిడ భోజనం చేసి వెళ్తుంటే ఆయన ముష్టి వాడులాగా బయటే ఉంటాడా అని బాలు సెటైర్లు వేస్తాడు.. శృతికి అగ్గి పెట్టి కూడా వెలిగించడం రాకపోవడంతో ప్రభావతి మీ నాన్న తిడుతుంది. మీనాని తిట్టొద్దు నాకు అగ్గిపెట్టి వెలిగించడం రాదు అని శృతి అంటుంది…
ఇంట్లో వంట చేయడం రాదని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. మ్యాగీ ఆమ్లెట్ వేసుకోవడం కూడా రాదా శృతి అని రోహిణి అడుగుతుంది. అంతలోనే సత్యం ఫ్రెండ్ రంగా ఇంటి కూడా వస్తాడు. రవి, శృతులు రంగా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభావతి సంప్రదాయం ప్రకారం.. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాలు తాగాలని, కలిసి తినాలని చెబుతోంది.. తనకు ఇలాంటి వింత ఆచారాలు, కట్టుబాటు నచ్చవనీ నిర్మొహమాటంగా చెబుతుంది శృతి. శృతి ప్రవర్తనను గమనించిన రంగా.. అమ్మాయి అచ్చు తన తండ్రి సురేంద్ర లాగానే ఉందని, ఆ అమ్మాయితో కాస్త జాగ్రత్తగా ఉండమని, లేకపోతే రవిని ఆడిస్తుందని వార్నింగ్ ఇస్తాడు. అన్ని కాలం అనుకూలంగా సర్దుకుంటాయని, ప్రభావతికి నచ్చితే.. చాలు ఎత్తిన పెట్టుకుని చూసుకుంటుందని చెబుతాడు సత్యం. ఏదేమైనా తన ముగ్గురు కొడుకులు కోడలతో తన ఇల్లు నిండుగా.. కళకళలాడుతూ సంతోషంగా ఉందని సత్యం రంగతో అంటాడు.
మీనాతో శృతి క్లోజ్ గా ఉండడానికి ప్రభావతి తట్టుకోలేక పోతుంది. శృతి నీలాగా పూలు అమ్ముకునే వాళ్ళ అమ్మాయి కాదు. కోటీశ్వరాలు అమ్మాయి. శృతికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది బాగోదు అని మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి.. తాను ఇప్పుడే తిననని చెబుతుంది. ఇప్పుడు ఇలానే అంటుంది ఇంకో 10 నిమిషాలు అయితే ఆకలి అవుతుందని ఆగమాగం చేస్తున్నాయి రవి అంటాడు. దీంతో శృతికి కోపం వస్తుంది. తనపై కామెంట్ చేస్తావా అంటూ.. తల్లి ముందే రవిని చితకబాదుతుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనంతరం ఇంట్లోకి నువ్వు అడుగుపెట్టడానికి.. తాను ఎంత కష్టపడ్డానోనని అంటుంది ప్రభావతి.. ఇక ప్రభావతి ఇంట్లో ఉన్న అన్ని రూములు చూపిస్తుంది రోహిణి రూమ్ చూడగానే చాలా బాగుంది అంటుంది. ఇక శృతి రవిలా శోభనానికి ఇంట్లో వాళ్ళందరూ ఏర్పాట్లు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మీనా బాలు ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..