E-Paper
Advertisement

OTT Movie : హిల్ స్టేషన్ లో ఇల్లు… చేయకూడని పని చేసి అడ్డంగా బుక్కయ్యే అబ్బాయి… స్పైన్ చిల్లింగ్ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : హిల్ స్టేషన్ లో ఇల్లు… చేయకూడని పని చేసి అడ్డంగా బుక్కయ్యే అబ్బాయి… స్పైన్ చిల్లింగ్ కొరియన్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఒక కొరియెన్ సినిమా, ఊహకందని ట్విస్ట్‌లతో మతిపోగొడుతోంది. ఈ సినిమాలో సన్నివేశాలు చివరి వరకూ అంత తేలిగ్గా అర్థం కావు. ఒక వ్యక్తికి తన మెమొరీ లాస్ అవ్వడంతో, ఈ స్టోరీ ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

Advertisement

ఈ కొరియెన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఫర్గాటెన్’ (Forgotten). 2017లో వచ్చిన ఈ సినిమాకి జాంగ్ హాంగ్-జున్ దర్శకత్వం వహించారు. ఇందులో కాంగ్ హా-నీల్ (జిన్-సియోక్), కిమ్ మూ-యియోల్ (యూ-సియోక్), మూన్ సుంగ్-కీన్ (తండ్రి), నా యంగ్-హీ (తల్లి) నటించారు. ఈ మూవీ ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఒక సైకలాజికల్ థ్రిల్లర్ . ఇది అనేక షాకింగ్ ట్విస్ట్‌లతో, ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠగా ఉంచుతుంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. IMDbలో 7.4/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళితే

Advertisement

1997లో21 ఏళ్ల జిన్-సియోక్ తన తల్లిదండ్రులు, అన్న యూ-సియోక్ తో కొత్త ఇంటికి మారుతాడు. జిన్-సియోక్ హైపర్‌సెన్సిటివిటీతో బాధపడుతూ, మందులతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు రాత్రి, అతను యూ-సియోక్‌ను కొంతమంది వ్యక్తులు వ్యాన్‌లో బలవంతంగా తీసుకెళ్లడం చూస్తాడు. 19 రోజుల తర్వాత యూ-సియోక్ మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. కానీ తన కిడ్నాప్ గురించి ఏమీ గుర్తులేదని చెబుతాడు. జిన్-సియోక్ తన అన్న ప్రవర్తనలో వింత మార్పులను గమనిస్తాడు. యూ-సియోక్ గతంలో కుంటుతూ నడిచేవాడు కాదు. అతని రోజువారీ మందులను తీసుకోవడం మానేస్తాడు. ఇంట్లోని ఒక లాక్ చేయబడిన గది నుండి వచ్చే శబ్దాలు జిన్-సియోక్‌ కు మరింత అనుమానాలు వస్తాయి. అతను తన అన్నను వెంబడించి , కుటుంబం గురించి ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఉన్న అతని తల్లిదండ్రులు, అన్న నిజమైనవాళ్ళు కాదు.వీళ్ళు ఆత్మలని తెలుస్తుంది. అతను 1997లో కాక 2017లో, తన 41 ఏళ్ల వయస్సులో ఉన్నాడని తెలుసుకుంటాడు.

ఈ కుటుంబం ఒక రహస్య ఆపరేషన్‌లో భాగంగా, 20 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో జరిగిన ఒక హత్య కేసును పరిశోధించేందుకు జిన్-సియోక్‌ను హిప్నోసిస్ ద్వారా 1997లో ఉన్నట్లు బ్రమలో ఉంటాడు. జిన్-సియోక్ గతంలో ఆ హత్యలతో సంబంధం ఉన్నాడని, అతని తన మానసిక గాయాల కారణంగా, జ్ఞాపకశక్తి కోల్పోయాడని తెలుస్తుంది. 1997 సమయంలో, జిన్-సియోక్ తన అన్న శస్త్రచికిత్స కోసం డబ్బు లేక ఒక దారుణమైన పనిని ఒప్పుకుంటాడు. ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే, ఒక తల్లి కూతురిని హత్య చేయాలని జిన్-సియోక్ కు చెప్తాడు. కానీ అతను అనుకోకుండా ఆ కుటుంబాన్ని చంపుతాడు. ఈ గాయం వల్ల అతను తన జ్ఞాపక శక్తి కోల్పోతాడు. చివరలో ఈ నిజాన్ని తెలుసుకున్న జిన్-సియోక్ గిల్టీతో, తనను తాను పాయిజన్ ఇంజెక్ట్ చేసుకుంటాడు. చివరికి జిన్-సియోక్ బతుకుతాడా ? తన అన్న పరిస్థితి ఏమిటి ? వీళ్ళంతా దెయ్యాలుగా మారతారా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అడవి మధ్యలో ఒంటరి అమ్మాయి… అందంగా ఉంది కదాని ఆశపడితే అల్టిమేట్ ట్విస్ట్… క్లైమాక్స్ డోంట్ మిస్

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×