OTT Movie : హారర్ థ్రిల్లర్ లవర్స్‌కి ఒక ఇండోనేషియన్ సినిమా మిస్టీరియస్ ఫీల్ ని ఇస్తోంది. ఈ సినిమా జావా టీ ప్లాంటేషన్ నేపథ్యంలో హాన్టెడ్, స్లీప్ పారాలిసిస్ తో ఒక మిస్టికల్ హారర్‌గా ఆకట్టుకుటోంది. క్షణ క్షణం భయపెట్టే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
రారా అనే యువతి, డచ్-ఇండోనేషియన్ అమ్మాయి. తన తండ్రి విలియం సౌండర్ నుంచి ఒక పెద్ద టీ ప్లాంటేషన్‌ను వారసత్వంగా పొందుతుంది. రారాని చిన్నప్పుడు ట్రినిల్ అని పిలిచేవాళ్ళు. రారా తన భర్త సుతాన్ తో కలిసి, హనీమూన్ తర్వాత ఈ ప్లాంటేషన్‌కు వెళ్లి కొత్త జీవితం మొదలుపెట్టడానికి సిద్ధపడుతుంది. సుతాన్ ఒక నర్స్, అతను హాస్పిటల్‌లో జాబ్ చేస్తూ, రారా ప్లాంటేషన్‌ని మేనేజ్ చేయాలని ప్లాన్ చేస్తారు. వాళ్లు హ్యాపీగా, ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేయాలని ఆశిస్తారు. కానీ ప్లాంటేషన్‌లోకి వచ్చాక రారా రాత్రిళ్లు డిస్టర్బ్ అవుతుంది. ఆమెకు స్లీప్ పేరాలిసిస్ లాంటి అనుభవాలు వస్తాయి. శరీరం కదలకుండా ఉండి, భయానక డ్రీమ్స్, వింత శబ్దాలు వస్తాయి.
ప్లాంటేషన్‌లోని వర్కర్స్ మధ్య కూడా వింత రిపోర్ట్స్ వస్తాయి. కొంతమంది వర్కర్స్ మిస్టీరియస్‌గా మరణిస్తారు. గుడ్ మ్యూజిక్ వినిపిస్తూ చిక్ అవుతారు లేదా హ్యాంగ్ అవుతారు. ఈ భాగంలో 1970 కాలం నాటి పాలిటికల్ బ్యాక్‌డ్రాప్ కథకు డెప్త్ ఇస్తుంది. ప్లాంటేషన్ హిస్టారికల్ సీక్రెట్స్ హింట్ చేస్తుంది. కథ నడిచేకొద్దీ టెన్షన్ పెరుగుతుంది. ఇంట్లో భయంకరమైన టెరర్ మొదలవుతుంది. ఒక డిసెంబాడీడ్ హెడ్ ఘోస్ట్ కనిపిస్తుంది. అది “ట్రినిల్, కెంబాలికాన్ తుబుహ్కు” (Trinil, return my body) అని పదేపదే చెబుతూ రారాను హాన్ట్ చేస్తుంది. ఈ ఘోస్ట్ ప్లాంటేషన్‌లోని గత రహస్యాలకు లింక్ అని తెలుస్తుంది.
టెరర్ పెరిగే కొద్దీ సుతాన్ తన ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్ యూసోఫ్ సహాయం తీసుకుంటాడు. యూసోఫ్ పారానార్మల్ కేసుల్లో ఎక్స్‌పర్ట్. ప్రొఫెషనల్ ప్సైకాలజిస్ట్ కూడా. అతను వచ్చాక, ప్లాంటేషన్‌లోని సినిస్టర్ సీక్రెట్ (ఫ్యామిలీ హిస్టరీ, మిస్టికల్ కనెక్షన్స్) గ్రాడ్యువలీ బయటపడుతుంది. కథలో సస్పెన్స్ బిల్డప్, ఘోస్ట్ మోటివ్, రారా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ (తండ్రి డచ్ హిస్టరీ, 1970 పాలిటిక్స్) కలిసి థ్రిల్ చేస్తాయి. యూసోఫ్ ఇన్వెస్టిగేషన్‌లో ట్విస్ట్‌లు వస్తాయి. రారా, సుతాన్ మధ్య ఎమోషనల్ స్ట్రెయిన్ పెరుగుతుంది. సినిమా ఇండోనేషియన్ మిథాలజీ యూజ్ చేసి, స్లీప్ పేరాలిసిస్, హాన్టింగ్‌ని మిక్స్ చేస్తుంది.
క్లైమాక్స్ లో ఘోస్ట్ ఐడెంటిటీ, ట్రినిల్ పేరు వెనుక రహస్యం, ప్లాంటేషన్ హిస్టరీ బయటపడుతాయి. రారా తన ఫ్యామిలీ గతాన్ని ఫేస్ చేస్తూ, సుతాన్, యూసోఫ్ సహాయంతో ఈ టెరర్‌ను ఓవర్‌కమ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కథ హార్ట్‌ఫెల్ట్ ఎండింగ్‌తో ముగుస్తుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎందుకొచ్చింది ? దాని గతం ఏమిటి ? దానిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘ట్రినిల్: కెంబలికాన్ తుబుహ్కు’ హనుంగ్ బ్రమంత్యో దర్శకత్వంలో వచ్చిన ఇండోనేషియన్ హారర్-థ్రిల్లర్ సినిమా. ఇందులో కర్మెలా వాన్ డెర్ క్రుక్ (రారా), రంగా నాట్రా (సుతాన్), ఫత్తా అమిన్ (యుసోఫ్), వులాన్ గురిత్నో (రారా తల్లి) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 జనవరి 4న ఇండోనేషియాలో విడుదలై, 2024 మే 9 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇండోనేషియన్ భాషలో ప్రధానంగా అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, హిందీ, తమిళం, తెలుగు వంటి మల్టిపుల్ డబ్బింగ్ లో కూడా అందుబాటులో ఉంది.
Read Also : 16 ఏళ్ల అమ్మాయిపై భక్తి పేరుతో బాబా దారుణం… IMDbలో రేటింగ్ 8.0… మస్ట్ వాచ్ కోర్టు రూమ్ డ్రామా