OTT Movie : రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన “సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హై” సినిమా ఎన్నో అవార్డులతో ప్రశంసలు అందుకుంది. మనోజ్ బాజ్పేయ్ ప్రధాన పాత్రలో ఒక సాధారణ లాయర్ గా అద్భుతంగా నటించాడు. ఆసారామ్ బాపు కేసు నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం కోర్ట్ రూమ్ డ్రామాతో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా 2023 ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డ్స్‌లో 7 నామినేషన్ల నుండి 5 అవార్డులు గెలుచుకుంది, అందులో బెస్ట్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ (అపూర్వ్ సింగ్ కార్కీ), బెస్ట్ యాక్టర్ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ (మనోజ్ బాజ్పేయ్) ఉన్నాయి. 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ డైలాగ్ అవార్డు గెలుచుకుంది. మొత్తం 37 నామినేషన్లతో 17 అవార్డులు గెలుచుకుంది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
జోధ్‌పూర్‌లోని సెషన్స్ కోర్ట్ లాయర్ పీసీ సోలంకి (మనోజ్ బాజ్పేయ్) అనే మిడిల్ క్లాస్ వ్యక్తి, తన తల్లి, కుమారుడితో ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. ఒక రోజు 16 ఏళ్ల అమ్మాయిపై, ఒక ప్రసిద్ధ బాబా అఘాయిత్యం చేసిన కేసు అతని వద్దకు వస్తుంది. బాబా లక్షలాది భక్తులతో ఒక శక్తివంతుడిగా ఉంటాడు. అతని ప్రభావం వల్ల పోలీసు, జడ్జిసియరీ, సమాజం అంతా అతని వైపే ఉంటారు. అయితే ఆమె తల్లిదండ్రులు కూతురికి జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా ఫిర్యాదు చేస్తారు. కానీ బాబా గ్యాంగ్ విట్నెస్‌లను హత్య చేయడం, లాయర్‌లను బెదిరించడం వంటి పనులు చేస్తుంది.
సోలంకి మొదట ఇంత పెద్ద కేసు తీసుకోవడానికి ఆలోచిస్తాడు. కానీ అమ్మాయి ధైర్యాన్ని చూసి కేసును తీసుకుంటాడు. ఆతరువాత POCSO యాక్ట్ కింద ఈ కేసు ట్రయల్ చేయాలని, బాలిక మైనర్ అని నిరూపించాలని పోరాడతాడు. కథ ముందుకు సాగుతున్న కొద్దీ, సోలంకి బాబా ప్రభావం, కోర్టు డ్రామా, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, డిఫెన్స్ లాయర్ తో వాదనలు హైలెట్ అవుతుంటాయి. సోలంకి మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ, న్యాయం కోసం పోరాటం చేస్తాడు. చివరికి బాబాకు శిక్ష కూడా పడుతుంది. ఈ సినిమా కోర్ట్‌రూమ్ డ్రామా, ఎమోషనల్ మూమెంట్స్, సోషల్ మెసేజ్ తో హార్ట్ ని టచ్ చేస్తుంది.
‘సిర్ఫ్ ఎక్ బందా కాఫీ హై’ (Sirf Ek Bandaa Kaafi Hai) అపూర్వ్ సింగ్ కార్కీ దర్శకత్వంలో వచ్చిన హిందీ లీగల్ డ్రామా సినిమా. జీ స్టూడియోస్ భానుషాలి స్టూడియోస్ పతాకంపై వినోద్ భానుషాలి, కమలేష్ భానుషాలి దీనిని నిర్మించారు. ఇందులో మనోజ్ బాజ్పేయ్ ప్రధాన పాత్రలో నటించారు, అద్రిజా సిన్హా, సూర్య మోహన్ కుల్శ్రేష్ఠ, నిఖిల్ పాండే, విపిన్ శర్మ, జైహింద్ కుమార్, దుర్గా శర్మ సపోర్టింగ్ రోల్స్‌లో ఉన్నారు. 2023 మే 23 నుండి ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ZEE5 ఒరిజినల్ ఫిల్మ్‌గా విడుదలైంది. హిందీ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ తో అందుబాటులో ఉంది. 2 గంటల 4 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 8.0/10 రేటింగ్ పొందింది.
Read Also : లాడ్జిలో అమ్మాయి హత్య… మంచానికి చేతులు కట్టేసి ఆ పాడు పని… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సిరీస్ మావా