Jewel Thief OTT : బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జూవెల్ థిఫ్’ కూకి గులాటి, రాబిగ్రేవెల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కునాల్ కపూర్, నిఖిత దత్త కీలక పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించారు కానీ, థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు.. దానికి కారణాలేంటి.? ఈ సినిమా ఏ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు చూద్దాం..
200 కోట్ల సినిమా ఓటీటీలోకి..
ఇక ఈ సినిమా కథ మొత్తం ఒక అరుదైన ఆఫ్రికన్ రెడ్ సన్ అనే వజ్రం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 500 కోట్లు రూపాయలు విలువైన వజ్రం. ఆ వజ్రాన్ని సైఫ్ అలీ ఖాన్ ఎలా దొంగతనం చేశాడు. అసలు జైదీప్ ఆహ్వాత్ కి ఈ వజ్రం కి సంబంధం ఏమిటి? అనేది తెలియాలంటే మనం ఈ సినిమాని పూర్తిగా చూడాల్సిందే. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో సినిమాని రూపొందించారు. సైఫ్ అలీ ఖాన్ స్టైలిష్ లుక్ తో దొంగగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జైదీప్ ఈ సినిమాలో మాఫియా డాన్ గా మనకి కనిపిస్తారు. ఈ డైమండ్ ను దొగలించిన సైఫ్ అలీ ఖాన్ ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కునాల్ కపూర్ నటించాడు. ఈ సినిమాని 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్లు సమాచారం. ఫైటర్, పఠాన్,డైరెక్ట్ చేసిన సిద్దర్ద్ ఆనంద్ ఈ సినిమా కి ప్రొడ్యూస్ చేయటం తోసినిమా ఫై అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఇంత ఖర్చు పెట్టి సినిమాను నిర్మించిన థియేటర్లో రిలీజ్ కి నోచుకోలేదు. ఓటీటీలో విడుదల చేయనున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
ఈరోజుల్లో సినిమాను థియేటర్ కి వెళ్లి చూసేవారికన్నా ఓటీటీలలో చూసే వారే ఎక్కువ అయ్యారు. కరోనా పుణ్యమా అని, ప్రపంచమంతా ఓటీటీలకు అలవాటు పడింది.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను నేరుగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ సినిమా ఈనెల (ఏప్రిల్) 25వ తేదీన నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. భారీ మొత్తంలోనే సినిమాను కొనుగోలు చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కావడం కొంత నిరాశపరిచినా, నిర్మాతకి కొంత లాభాన్ని చేకూరుస్తుందని చెప్పొచ్చు. సినిమాలు డైరెక్టుగా థియేటర్లో చూడాలి అని అనుకునే అభిమానులకి ఈ నిర్ణయం కాస్త నిరాశపరిచిన మాట వాస్తవం. సైఫ్ అలీ ఖాన్ తెలుగులో ఎన్టీఆర్ దేవర1 సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించారు. ఏది ఏమైనా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అయిన తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.