E-Paper
Advertisement

Upcoming movies OTT: ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోకి వస్తున్న కన్నడ సినిమాలు ఇవే

Upcoming movies OTT: ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలోకి వస్తున్న కన్నడ సినిమాలు ఇవే
Advertisement

Upcoming movies OTT : ఈ వీకెండ్ ఓటీటీలలో అదిరిపోయే కన్నడ కంటెంట్ రాబోతోంది. అలాగే థియేటర్లలో కూడా సినిమాలు అడుగు పెట్టబోతున్నాయి. వీటిలో స్టేట్ అవార్డ్ సినిమా కూడా ఉంది. ఈ సినిమాలను ఫ్యామిలితో కలసి కూడా చూడవచ్చు. మరి ఇవి ఏ ఓటీటీలలో ఎప్పుడు రాబోతున్నాయో తెలుసుకుందాం పదండి.

నీలి హక్కీ 

కన్నడలో ‘నీలి హక్కి’ అని పిలిచే పక్షిని తెలుగులో పాలపిట్ట అని అంటారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారిక పక్షి కూడా. గణేష్ హెగ్డే దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ చిత్రం, 2020లో రాష్ట్ర అవార్డును కూడా గెలుచుకుంది. ఇది ఒక పదేళ్ల బాలుడు, అతని కుటుంబం పచ్చని పచ్చిక బయళ్ళు ఉన్న తన పల్లెటూరికి తిరిగి వెళ్లాలనుకునే ఫీల్ గుడ్ స్టోరీ. ఇది Sun NXTలో 2026 ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ లో ఉంటుంది.

రాక్షస

Advertisement

రాజ్ బి శెట్టి హీరోగా నటించిన ‘ఓండు మొట్టేయ కథే’ సినిమా నిర్మాత సుహాన్ ప్రసాద్, ఈ కన్నడ వెబ్ సిరీస్ కు దర్శకుడిగా మారారు. ఇందులో విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్ర పోషించారు. 7 ఎపిసోడ్ల ఈ సిరీస్ ఉంటుంది. ఉత్తర కర్ణాటకలో జరిగిన వరుస హత్యల దర్యాప్తు చుట్టూ స్టోరీ తిరుగుతుంది. Zee5లో ఇది 2026 ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ లో ఉంటుంది.

తీర్థరూప తండేయవారిగే

దర్శకుడు రామేనహళ్లి జగన్నాథ రూపొందించిన ఈ సినిమా, ఒక ట్రావెల్ వ్లాగర్ చుట్టూ తిరుగుతుంది. అతను కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబాన్ని విడిచిపెట్టి ఉంటాడు. ఇక చాలా కాలం తరువాత తన కుటుంబానికి దగ్గరయ్యేందుకు వస్తాడు. ఈ నేపథ్యంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో నిహార్ ముఖేష్, సితార, రవీంద్ర విజయ్ నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది 2026 ఫిబ్రవరి 20న విడుదల కానుంది.

చాఠా పచ్చా

Advertisement

నిజానికి ఇది మలయాళ సినిమా, కానీ కన్నడ డబ్బింగ్ వెర్షన్ కూడా వస్తోంది. రోషన్ మాథ్యూ, అర్జున్ అశోకన్ నటించిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ కామెడీ. ఇది ఫిబ్రవరి 19 నుండి Netflixలో అందుబాటులో ఉంటుంది.

సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం

దర్శకుడు దేవిప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ సినిమాలో విజయ్ రాఘవేంద్ర పోలీస్ పాత్రలో నటించాడు. ఒక చిన్న పట్టణంలో సీరియల్ కిల్లర్ వేట చుట్టూ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్‌పాండే, సాగర్ పురాణిక్, మాలతేష్ హెచ్‌వి వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఇది ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజ్ కానుంది.

సరళ సుబ్బారావు

ఇది 1970ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్ స్టోరీ. వింటేజ్ ఫీల్ కావాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్. దర్శకుడు మంజు స్వరాజ్ ఒక కన్నడ నవలను సరళ సుబ్బారావుతో పెద్ద తెరపై ప్రజెంట్ చేస్తున్నారు. ఇందులో కృష్ణ అజయ్ రావు, మిషా నారంగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ కథ కొత్తగా పెళ్లైన జంట చుట్టూ తిరుగుతుంది. ఇది ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదల కానుంది.

Read Also :  ఈ వారం ఓటీటీని షేక్ చేయనున్న సిరీస్ లు ఇవే… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×