OTT Movie : ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో కావాల్సిన కంటెంట్ ని సెలెక్ట్ చేసుకుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లోనే వీటిని ఎక్కడ పడితే అక్కడ చూసే అవకాశం ఉండడం కూడా ఇందుకు ఓ ప్రధాన కారణం. అయితే అందులోనూ హారర్ సినిమాలకు ఉంటే క్రేజ్ ఏంటో తెలిసిందే. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సూపర్ న్యాచురల్ పవర్స్ తో నడుస్తుంది. స్టోరీ ముందుకు వెళ్ళే కొద్ది ట్విస్ట్ లు, సస్పెన్స్ తో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తుంది. ఈ మలయాళం మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ రామన్ పెరుమాళయన్ అనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చుట్టూ తిరుగుతుంది. అతను హెల్సింకిలో నివసిస్తాడు. ఆత్మలు మనసులో జన్మిస్తాయని నమ్ముతుంటాడు. కథలోకి వెళ్తే… కేరళలో ఒక రియాలిటీ టీవీ షో షూటింగ్ సమయంలో ఐదు మంది వ్యక్తులు అనుమానస్పదంగా చనిపోతారు. రియాలిటీ షో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో, భయంకరమైన పాడుబడిన ఇంటిలో జరుగుతూ ఉంటుంది. హెల్సింకిలోనే ఉన్న రామన్ పెరుమలయన్ అనే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, ఈ కేసులో అనుమానాస్పద మరణాలను దర్యాప్తు చేయడానికి కేరళకు వస్తాడు.
పెరుమలయన్ మాజీ ప్రియురాలు ఈ రియాలిటీ షో నడుపుతూ ఉంటుంది. ఇందులో ఆమె భర్త కూడా చనిపోతాడు. ఈ ఇంటిని ఒక దుష్ట దేవత ఆవహించిందని ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు చెబుతుంటారు. రామన్ పెరుమలయన్ తన తెలివితేటలను ఉపయోగించి, ఈ మరణాల వెనుక ఉన్న అతీంద్రియ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆ మరణాలకు కారణం రామన్ పెరుమలయన్ కనిపెడతాడా ? దెయ్యమే వాళ్ళను చంపిందా? లేదంటే మరెవరైనా ఈ హత్యలు చేశారా ? అతీంద్రియ శక్తుల వల్ల రామన్ కు ఏమైనా సమస్యలు వస్తాయా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పెళ్ళి ఫిక్స్ అయ్యాక కాబోయే వాడి గురించి అలాంటి సీక్రెట్ తెలిస్తే… కీర్తి సురేష్ సస్పెన్స్ థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వడక్కన్’ (Vadakkan). 2025 లో వచ్చిన ఈ మలయాళ మూవీకి సజీద్ ఎ దర్శకత్వం వహించారు. ఇందులో కిషోర్, శ్రుతి మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జానపద కథల ఆధారంగా తెరకెక్కింది. అతీంద్రియ శక్తులను హైలైట్ చేస్తూ, చివరి వరకూ సస్పెన్స్ తో ఈ మూవీని ఉత్కంఠంగా తెరకెక్కించారు. ఈ మూవీ 2025 మార్చి 7 న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.