BigTV English
Advertisement

OTT Movie : పెళ్ళి ఫిక్స్ అయ్యాక కాబోయే వాడి గురించి అలాంటి సీక్రెట్ తెలిస్తే… కీర్తి సురేష్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : పెళ్ళి ఫిక్స్ అయ్యాక కాబోయే వాడి గురించి అలాంటి సీక్రెట్ తెలిస్తే… కీర్తి సురేష్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఈ రోజుల్లో ఓటీటీని ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. ఇందులో నచ్చిన సినిమాను, దొరికిన సమయంలో చూసుకుంటూ ఆనందిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఆడవాళ్ళు సమాజంలో ఎదుర్కొనే సమస్యలతో, ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


జీ5 (Zee5) ఓటీటీలో

ఈ పొలిటికల్ క్రైమ్ కామెడీ మూవీ పేరు ‘రఘు తాత’ (Raghu tha tha). 2024 లో విడుదలైన ఈ సినిమాకు కుమార్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ దీనిని నిర్మించారు. ఇందులో కీర్తి సురేష్, ఎం.ఎస్. భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, జయకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 ఆగస్టు 15న థియేటర్లలో విడుదలైంది. సెప్టెంబర్ 13 నుండి జీ5 (Zee5) ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

1960ల నాటి తమిళనాడులో, కాయల్విరి పాండియన్ అనే యువతి, హిందీ భాషాకు వ్యతిరేకంగా పోరాడే యాక్టివిస్ట్. కాయల్విరి మద్రాస్ సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగినిగా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఒక ‘పాండియన్’ అనే మగవాడి పేరుతో రచనలు చేస్తుంది. ఎందుకంటే స్త్రీ రచయితల పట్ల సమాజంలో తక్కువ ఆదరణ ఉంటుందని ఆమె భావిస్తుంది. వల్లువన్‌ పేట్టై అనే గ్రామంలో నివసించే కాయల్విఴి, తన తాత రఘోత్తమన్ తో గట్టి బంధం కలిగి ఉంటుంది. వారిద్దరూ కలిసి గతంలో గ్రామంలో హిందీ సంస్థ కు వ్యతిరేకంగా పోరాడి ఉంటారు. అయితే, కాయల్విరి తల్లిదండ్రులు ఆమెను త్వరగా పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. పెళ్ళి చేసుకోవడానికి ఆమె అంతగా ఆసక్తి చూపించదు.

ఒకరోజు కాయల్విరి తాతకు క్యాన్సర్ ఉన్నట్లు తెలుస్తుంది. అతను మూడు కోరికలను నెరవేర్చాలని కాయల్విరికి చప్పి, వాటిని తీర్చమని కోరుకుంటాడు. మద్రాస్‌లో బుహారీ బిర్యానీ తినడం, ఎమ్.జి. రామచంద్రన్‌తో ఫోటో తీయించుకోవడం. కాయల్విరి పెళ్లి చూడటం వంటివి అతనికి చివరి కొరికలుగా ఉంటాయి.  తన తాత కోరిక కోసం కాయల్విరి, పెళ్లికి అంగీకరిస్తుంది. తన స్నేహితుడు తమిళ్‌సెల్వన్ ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అతను ఆమె ఫెమినిస్ట్ ఆలోచనలను సమర్థించే వ్యక్తిగా ఉంటాడు. అయితే అతని నిజ స్వరూపం మరోలా ఉంటుంది. పైకి మంచిగా నటిస్తూ, లోపల వక్ర బుద్ధి కలిగి ఉంటాడు. చివరికి కాయల్విరికి పెళ్లి జరుగుతుందా ? తన తాత మూడు కోరికలను తీరుస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : దొంగతనానికి వెళ్లి, పని చూసుకోకుండా… ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా సామి?

Related News

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

OTT Movie : భార్య చనిపోవడంతో మరో అమ్మాయితో… దెయ్యం పాపతో ఆ పనులేంటి భయ్యా ?

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Big Stories

×