BigTV English

OTT Movie : పిల్లల్ని కనలేని భర్త … మరొకరితో ఆ పని చేయించుకునే భార్య

OTT Movie : పిల్లల్ని కనలేని భర్త … మరొకరితో ఆ పని చేయించుకునే భార్య

OTT Movie : మలయాళం సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కథను సింపుల్ గా ప్రజెంట్ చేయడంలో ఈ దర్శకులు ఒక అడుగు ముందే ఉన్నారు. ఈ మలయాళం సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక పల్లెటూరిలో నివాసం ఉండే, భార్యాభర్తల చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఆహా (aha) లో

ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘వెప్పం కులిర్ మజై’ (Veppam Kulir Mazhai). 2024 లో విడుదలైన ఈ తమిళ ఫ్యామిలీ డ్రామా మూవీకి పాస్కల్ వేదముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ధీరవ్, ఇస్మత్ బాను, ఎంఎస్ భాస్కర్ నటించారు. హ్యాష్‌ట్యాగ్ FDFS ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ధీరవ్ ఈ మూవీని నిర్మించారు. భర్త వల్ల పిల్లలు పుట్టక పోవడంతో, భార్య వేరే పద్దతిలో ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం తెలీయని భర్త ఆ పిల్లాడిని తన కొడుకు అనుకుంటాడు. ఆ తరువాత స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీ లోకి వెళితే

రాజుకు రమాతో కొత్తగా వివాహం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఒక పల్లెటూరిలో చాలా సంతోషంగా ఉంటారు. రాజు పశువులకు ఇంజక్షన్ల ద్వారా గర్భం దాల్చే చిన్న వైద్యుడిగా పని చేస్తుంటాడు. వీరి వివాహం జరిగి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంతవరకు వీళ్లకు పిల్లలు పుట్టకపోవడంతో చాలా బాధపడతారు. రాజు అమ్మగారైతే రమను సూటిపోటి మాటలతో వేధించడం మొదలు పెడుతుంది. భర్తకు కూడా ఊర్లో గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. కొంతమంది నీచంగా కూడా మాట్లాడతారు. భర్త పడుతున్న బాధను చూసి మరో పెళ్లి చేసుకోమంటుంది రమ. అయితే భర్త మరో పెళ్లికి ఒప్పుకునే లోగా రమ తల్లి చనిపోతుంది. ఒంటరిగా ఉన్న రమను చూసి, మరో పెళ్లి చేసుకోవడానికి వెనకాడతాడు రాజు. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేసుకుంటారు. భర్తలో లోపం ఉందని రిపోర్టులో తెలుస్తుంది. ఈ విషయం భర్తకు చెప్పకుండా, మందులు వాడితే పిల్లలు పుడతారు అని అబద్ధం చెప్తుంది రమ.

ఆ తర్వాత రమ వేరొకరి స్పెర్మ్ ఉపయోగించి గర్భం తెచ్చుకుంటుంది. కొద్దిరోజుల్లోనే పిల్లాడు కూడా పుడతాడు. రాజు చాలా సంతోషంతో పండగ చేసుకుంటాడు. అయితే ఈ అబద్ధం ఎక్కువకాలం దాగదు. ఒకరోజు భర్తకి ఈ విషయం దాచి పెట్టలేక చెప్పేస్తుంది రమ. ఆ తర్వాత రాజు చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. ఆ పిల్లాడిని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు. చివరికి రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు? వీళ్ళిద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తారా? పుట్టిన పిల్లాడిని రాజు దగ్గరికి తీసుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘వెప్పం కులిర్ మజై’ (Veppam Kulir Mazhai) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Tags

Related News

OTT Movie : 40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మాయి కోసం వేట… టాటూతో ఊహించని ట్విస్ట్… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పని భయ్యా ? స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : ఈ ఊర్లో అమ్మాయిల్ని పుట్టకుండానే చంపేస్తారు… అలాంటి గ్రామాన్ని మార్చే ఆడపిల్ల… ఒక్కో ట్విస్ట్ మెంటల్ మాస్

OTT Movie : అవెంజర్స్ ను జాంబీలుగా మార్చే వైరస్… ప్రపంచాన్ని అంతం చేసే డాక్టర్ డూమ్ ఈవిల్ నెస్

OTT Movie : ఆఫీస్ లో పీడకలగా మారే చివరిరోజు… ఈ కొరియన్ కిల్లర్ అరాచకం చూస్తే గుండె జారిపోద్ది మావా

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

Big Stories

×