Hyderabad Crime News: హైదరాబాద్, ట్యాంక్ బండ్ నడి ఒడ్డున దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా నిప్పంటించి తగులబెట్టిన ఘటన జరిగింది. దోమలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
చుట్టు పక్కల స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి క్లూస్ టీంను పిలిపించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో సంఘటనా స్థలంలో పలు ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. పలు ఆధారాలు సేకరించిన ఆనంతరం అప్పుడే పుట్టిన ఆడ శిశువుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.
బతికుండగానే పసికందును చంపారా.? మృతిచెందిన పసికందు ఆధారాలు లేకుండా చేసేందుకు ఇక్కడికి తీసుకువచ్చి చంపేశారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పసికందును ఎందుకు చంపారు..? ఎవరు చంపారు? అనే విషయాలను సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Delimitation: అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏమిటి..? దక్షిణాది రాష్ట్రాలకే ఎందుకీ నష్టం..?
ALSO READ: CM Revanth Reddy: యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.4,00,000 స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్