Virgin Boys:ఈ మధ్యకాలంలో థియేటర్లలో మెప్పించిన చాలా సినిమాలు ఇటు ఓటీటీలో కూడా విడుదలవుతూ.. ఓటీటీ ప్రియులను కూడా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘వర్జిన్ బాయ్స్’ సినిమా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. గీత్ ఆనంద్ (Geeth anand), మిత్రావ్ శర్మ (Mitraav Sharma) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. శ్రీహాన్ , జెన్నీఫర్ ఇమాన్యుల్, రోనిత్, అన్షు ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా జూలై 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమయ్యింది. వర్జిన్ బాయ్స్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకోగా.. ఆగస్టు 15 నుంచి అనగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు ప్రకటించారు.
వర్జిన్ బాయ్స్ సినిమా విశేషాలు..
దయానంద్ గడ్డం దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రానికి రాజ్ గురు ఫిలిమ్స్ పతాకం పై రాజా ధారపునేని నిర్మాతగా వ్యవహరించారు. యువకులలో ప్రేమ, సంబంధం, కన్యత్వం ఇతివృత్తాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ లభించగా.. ఇందులో ఆరు పాటలు, బలమైన నేపథ్య సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వర్జిన్ బాయ్స్ సినిమా స్టోరీ..
ఇక కథ విషయానికి వస్తే.. ఒక యూనివర్సిటీలో డూండీ (Srihan ), ఆర్య (గీత్ ఆనంద్), రోణి (రోనిత్ రెడ్డి) కలిసి చదువుకుంటూ ఉంటారు.. కాలేజీలో ప్రతి ఒక్కరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. మనకి మాత్రం లేరు అనే ఫ్రస్టేషన్లో ఉన్న వీరిని.. వీరి స్నేహితుడు (బిగ్ బాస్ కౌశల్) మరింత రెచ్చగొడతాడు. ఇక తాను అమెరికా వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి అందరూ వర్జినిటీ కోల్పోవాలని చాలెంజ్ కూడా విసురుతారు. అలా ముగ్గురు స్నేహితులు ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు. అయితే ఒక్కొక్కరుగా వారి ప్రేమలో విఫలమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. చివరికి ఈ ప్రేమ జంటలు ఒకటయ్యాయా లేదా వర్జినిటీ కోల్పోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ ముగ్గురు స్నేహితులు వర్జినిటీ కోల్పోయారా? లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఇక వాస్తవానికి అడల్ట్ కామెడీ సినిమాలు తెలుగులో చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్ ప్రమోషనల్ కంటెంట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరిది అడల్ట్ కంటెంట్ మూవీ అనుకున్నారు. కానీ ఇది థియేటర్లోకి వచ్చిన తర్వాత జోక్స్ కొంచెం అలాగే ఉన్నా.. ఇది అడల్ట్ కామెడీ సినిమా అయితే కాదు.. యువతను మెయిన్ టార్గెట్ చేసుకొని మాత్రమే ఈ సినిమా రాశారు. ఇక అప్పుడే కాలేజీకి వచ్చిన యువతలో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి అనే విషయాన్ని ప్రధానంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక అటు థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ALSO READ:Anupama: నా సినిమాలలో ఇప్పటివరకు నచ్చని పాత్ర అదే!