Coolie: ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ తో పాటు, ఉపేంద్ర, అమీర్ ఖాన్, నాగార్జున, సౌబిన్ వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో కనిపిస్తున్నారు.
ఇకపోతే దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు ఒక సపరేట్ బ్రాండ్ ఉంది. అందుకే రజనీకాంత్ నటించిన ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు రజనీకాంత్ నటించిన సినిమాలు తెలుగులో విడుదలైన కూడా ఇంత బజ్ లేదు. కానీ ఈ కాంబినేషన్ వలన ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఒక ఆగస్టు 14న కూలీ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
పిల్లలపై ఆంక్షలు
ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అందుకే ఈ సినిమాకు పిల్లలకు ఎంట్రీ లేదు. చాలా చోట్ల పిల్లలకు ఈ సినిమాకు ఎంట్రీ లేదు అని బోర్డులు కూడా పెట్టేశారు. ఇక తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నుంచి కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది. కచ్చితంగా ఈ సినిమా చూడడానికి ఏజ్ సర్టిఫికెట్ ఉండాలి అని తేల్చి చెప్పేసింది మేనేజ్మెంట్. అయితే మామూలుగా సినిమా అంటే ఫ్యామిలీ అంతా కూడా వెళ్లి చూడాలి అని అనుకుంటారు. అని ఇలా ఏ సర్టిఫికెట్ రావడం వలన కొంతమేరకు సినిమా కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని సందీప్ రెడ్డి వంగా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏ సర్టిఫికెట్ రావటం వలన సినిమా కలెక్షన్ల పైన దెబ్బబడే అవకాశం ఉంది.
Please note: Coolie is an A-rated film, suitable only for viewers aged 18 and above, owing to its high-octane action and mature theme. pic.twitter.com/rLA8wNHmfL
— Prasads Multiplex (@PrasadsCinemas) August 12, 2025
భారీ అంచనాలు
ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా ఆ ఎక్స్పెక్టేషన్ ఇంకా రెట్టింపు చేసింది. అన్నిటిని మించి అనిరుద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ప్రస్తుతం ఈ సినిమాపై విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్ని వర్కౌట్ అయితే కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ సినిమా కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోతాయి. ఇక చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలతో ఉంది. ఇదివరకే చాలామంది స్టార్స్ ని ఒకే సినిమాలో డీల్ చేసిన అనుభవం కూడా లోకేష్ కి ఉంది. విక్రమ్ సినిమా చాలామందికి కనెక్ట్ అవ్వటానికి పవర్ఫుల్ క్యారెక్టర్స్ కారణం. ప్రస్తుతం అదే విధంగా ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి.
Also Read: Coolie : వార్ 2 ను డామినేట్ చేసిన కూలీ, హిట్ టాక్ వస్తే కానీ గట్టెక్కదు