BigTV English

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Kohli Beard : టీమిండియా మాజీ కెప్టెన్, కీలక ఆటగాడు,  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. టీమిండియాకి ఇప్పటికే టీ-20, టెస్ట్ మ్యాచ్ లకు గుడ్ బై చెప్పేశాడు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు లండన్ లోనే ఉంటున్నారు. కేవలం వన్డే మ్యాచ్ లు జరిగిన సమయంలోనే ఇండియా కి వచ్చి.. అవి ముగిసిన తరువాత విరాట్ కోహ్లీ లండన్ వెళ్లిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోహ్లీ తన చిన్నప్పటి స్నేహితుడిని కలిశాడు. ఆ సందర్భంగా విరాట్ కోహ్లీ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో విరాట్ కోహ్లీ ముసలోడు అయిపోయాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయడం మొదలు పెట్టారు. వాళ్లు వీళ్లు చేస్తే.. ఏమో కానీ ఏకంగా కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా కోహ్లీని ట్రోలింగ్స్ చేయడం గమనార్హం.


మన కోహ్లీనేనా..? 

తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో కనిపించింది. అయితే కర్ణాటక కి చెందిన ప్రముఖ న్యాయవాది శశికిరణ్ శెట్టి కోహ్లీ తో పాటు కనిపించారు. ఇక ఈ ఫొటోలో విరాట్ కోహ్లీ అస్సలు గుర్తు పట్టలేని పరిస్థితిలోకి మారిపోయాడు. తెల్ల గడ్డంతో వయస్సు పైబడిన వాడిలా కనిపిస్తున్నాడు. ఇది చూసిన విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఇది మన కోహ్లీనేనా..? అని ఆశ్చర్యపోతున్నారు. ఇలా మారిపోయాడేంటి రా..? బాబు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక కోహ్లీ టీ-20, టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటిన తరువాత.. కేవలం వన్డేలకు మాత్రమే పరిమితం అయ్యాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు క్రికెట్ ఆడతాడే అంచనాలు అయితే ఉన్నాయి. కానీ తాజా ఫొటో చూసిన తరువాత కోహ్లీ మరో రెండేళ్ల పాటు వన్డేలు ఆడగలడా..? అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.


కోహ్లీ కొత్త లుక్ పై..! 

దీంతో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై కూడా ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు బీసీసీఐ కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లను తప్పించేందుకు ప్లాన్ చేస్తుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోహ్లీ తెల్ల గడ్డం పై మరికొందరూ మాత్రం చాలా మందికి తెల్ల గడ్డం ఉంటుందని.. కోహ్లీకి ఒక్కడికే కాదని.. ఇందులో ఇబ్బంది ఏముందని పేర్కొంటున్నారు. వాస్తవానికి ఆటగాళ్లకు ఫిట్ నెస్ ముఖ్యమని.. ఆ విషయంలో విరాట్ కోహ్లీ 20 ఏళ్ల యువకులతో సైతం పోటీ పడగలడని అభిప్రాయపడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ కలిసింది ప్రముఖ న్యాయవాది శశికిరణ్ శెట్టిని. ఐపీఎల్ 2025 లో ఆర్సీబీ ట్రోఫీ గెలిచిన సందర్భంగా బెంగళూరులో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆర్సీబీ పై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ఆర్సీబీ తరపున శశి కిరణ్ రెడ్డి వాదిస్తున్నట్టు సమాచారం. అందుకే విరాట్ కోహ్లీతో ఈ కేసు విషయం పై మాట్లాడేందుకు కోహ్లీ ఆయనతో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగా కోహ్లీ కొత్త లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోవడం విశేషం.

 

Related News

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Dewald Brevis : డెవాల్డ్ బ్రెవిస్ ఊచకోత.. ఏకంగా 8 సిక్స్ లతో రచ్చ..CSK ఇక తిరుగులేదు

Subhman-Anjini : టీమిండియా క్రికెటర్ తో అందాల తార ఎఫైర్… పబ్బులో అడ్డంగా దొరికిపోయారుగా

India Asia Cup Squad: ఆసియా కప్ కోసం 4 గురు ఆల్ రౌండర్లు, 6 గురు బౌలర్లు.. టీమ్ ఇండియా ఫుల్ స్క్వాడ్ ఇదే !

Big Stories

×