OTT Movie : ఎక్కడ చూసినా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలనే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. సస్పెన్స్, ట్విస్ట్‌లతో వచ్చే స్టోరీలను అస్సలు వదిలిపెట్టడంలేదు. ఈ సినిమాలు ట్రెండింగ్ లో కూడా ముందువరుసలో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక రిటైర్డ్ జడ్జి హత్య చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా మిస్టరీని నెక్స్ట్ లెవల్ లో చూపిస్తూ, సీట్ ఎడ్జ్ థ్రిల్ ను ఇస్తోంది. దీని పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే
‘ఇంటరాగేషన్’ (Interrogation) 2025లో రిలీజైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అజోయ్ వర్మ రాజా, ఎస్. అగర్వాల్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో రాజ్‌పాల్ యాదవ్, అభిమన్యు సింగ్, యశ్‌పాల్ శర్మ, మను సింగ్, దర్శన్ జరివాలా, గిరీష్ కులకర్ణి నటించారు. 2025 మే 30న ZEE5లో ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. IMDbలో 6.8/10 రేటింగ్ ని పొందింది.
కథలోకి వెళ్తే
విశేష్ ఇష్కరన్ పరాశర్ అనే ఒక రిటైర్డ్ జడ్జి తన ఇంట్లో హత్యకు గురవుతాడు. ఆ రోజు అతన్ని బన్సీలాల్, యూసఫ్, తారా, రాజన్ అనే నలుగురు వ్యక్తులు కలిసినట్లు తెలుస్తుంది. వీళ్లే ప్రధాన సస్పెక్ట్‌లుగా ఉంటారు. పోలీసు ఆఫీసర్ మను సింగ్ వీళ్లను ఇంటరాగేట్ చేయడంతో, అనుకోని ట్విస్టులు ఎదురుపడతాయి. ఆశ్చర్యకరంగా ఈ నలుగురూ జడ్జిని హత్య చేసినట్లు ఒప్పుకుంటారు. కానీ ప్రతి ఒక్కరూ వేర్వేరు కారణాలు చెబుతారు. బన్సీలాల్ జడ్జి తన కుటుంబాన్ని నాశనం చేశాడని, యూసఫ్ బిజినెస్ లాస్‌ల కోసం, తారా పర్సనల్ రివెంజ్ కోసం, రాజన్ రాజకీయ కారణాలతో హత్య చేశామని చెబుతారు. ఈ కథనాలు పోలీసులను, ప్రేక్షకులను గందరగోళంలో పడేస్తాయి.
ఇంటరాగేషన్ ముందుకు సాగుతున్నప్పుడు, జడ్జి హత్య వెనుక ఒక పెద్ద కుట్ర బయటపడుతుంది. ఒక అవినీతి రాజకీయ నాయకుడు ఈ హత్యకు సంబంధం ఉందని తెలుస్తుంది. ప్రతి సస్పెక్ట్ గతంలో జడ్జి తీర్పుల వల్ల నష్టపోయి, రివెంజ్ కోసం వచ్చినట్లు చూపిస్తారు. మను సింగ్ ఈ కేసును సాల్వ్ చేయడానికి తన తెలివిని, స్కిల్స్ ని ఉపయోగిస్తాడు. కథలో ట్విస్ట్‌లు వస్తూ, ఒక్కో సస్పెక్ట్ కథ వెనుక దాగిన సీక్రెట్ బయటపడతాయి. అసలు హంతకుడు ఎవరనేది చివరివరకూ ఉత్కంఠతను పెంచుతుంది. ఈ సినిమా షాకింగ్ క్లైమాక్స్ కు ప్రేక్షకుల దిమ్మ తిరిగిపోతుంది. అసలు హంతకుడు ఎవరు ? ఇంటరాగేషన్ లో బయటికి వచ్చే విషయాలు ఏమిటి ? ఎందుకు జడ్జిని చంపారు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : శపించబడిన మాన్షన్‌లో షూటింగ్… ఈవిల్ డెడ్ ను మించిన డేంజర్ సీన్లు… ఈ మూవీ ఏంటి భయ్యా ఇంత బ్రూటల్ గా ఉంది?