Smita Sabharwal: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఎందుకు దూరంగా ఉంటున్నారు? లాంగ్ లీవ్ పెట్టడానికి కారణమేంటి? పైకి చైల్డ్ కేర్ లీవ్ అని చెబుతున్నా.. లోపల కారణాలు వేరేగా ఉన్నాయని తోటి ఐఏఎస్‌లు ఎందుకంటున్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ లాంగ్‌లీవ్‌పై ఉన్నారు. ఈ నెల ఒకటి నుంచి వచ్చేఏడాది జనవరి 31 వరకు విధులకు దూరంగా ఉండనున్నారు. చైల్డ్ కేర్ లీవ్ పేరిట 6 నెలల సెలవు పెట్టారని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడైంది. ఆమె పెట్టుకున్న దరఖాస్తును గత నెలలో ప్రభుత్వం ఆమోదించింది.
తెలంగాణ ఆర్థిక సంఘం కార్యదర్శిగా ఉన్న ఆమె, తన బాధ్యతలను సెర్ప్ అదనపు సీఈఓ కాత్యాయనీ దేవికి అప్పగించారు. తాను అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు స్మితా సబర్వాల్ కొన్నాళ్లు కిందట బయటపెట్టారు. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా కొన్ని విషయాలు బయటపెట్టారు.
కొన్నిసార్లు మన జీవితంలో అత్యంత ప్రశాంతమైన కాలాలు.. మనతో బిగ్గరగా మాట్లాడతాయని రాసుకొచ్చారు. కొన్ని నెలలుగా వెన్నెముక సమస్య వెంటాడుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నానని, ఈ సమస్యను అధిగమిస్తానని రాసుకొచ్చారు. అంతేకాదు స్మిత సబర్వాల్ ఓ పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదిస్తున్న వీడియో పోస్టు చేశారు.
ALSO READ: తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ కి కారణాలివే
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె ఓ వెలుగు వెలిగారని తోటి అధికారులు సమయం, సందర్భం వచ్చినప్పుడు చెబుతుంటారు. అయితే హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమెని పక్కన పెట్టిందని చెప్పుకున్నారు.
అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్ల తొలగింపు సమయంలో ఏఐ ఆధారిత నకిలీ వీడియోను సోషల్ మీడియాలను ఆమె పోస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు.
దీనికితోడు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు స్మితా సబర్వాల్. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని ప్రభుత్వ వర్గాల మాట. ప్రాధాన్యత లేని పోస్టింగ్స్, ఇబ్బందికర పరిస్థితులు కారణం వల్ల లాంగ్ లీవ్ పెట్టి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఆరునెలల్లోపు సమస్యలు చక్కబడతాయని భావిస్తున్నారట ఆమె.
లాంగ్ లీవ్ పెట్టిన సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్..
31 జనవరి 2026 వరకు సెలవులో స్మితా సబర్వాల్
ఆమె స్థానంలో సెర్ప్ అదనపు సీఈఓగా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు
అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు, త్వరలోనే కోలుకుంటానని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్… pic.twitter.com/9r8Fdbklvq
— BIG TV Breaking News (@bigtvtelugu) August 29, 2025