OTT Movie : కొన్ని చిన్న సినిమాలే అయినా సరదాగా సాగిపోతూ మంచి అనుభూతిని ఇస్తాయి. తెలుగులో వచ్చిన ఒక కామెడీ, క్రైమ్ డ్రామా చిత్రం ఈ కోవలోకేవస్తుంది. ఈ స్టోరీ ఒక విలువైన డైమండ్ రింగ్ చుట్టూ తిరుగుతుంది. దీనికి తోడు ఒక లవ్ స్టోరుకూడా నడుస్తుంటుంది. ఈ రెండూ కలిపి సినిమాకి ఒక కొత్త వైబ్ ని తీసుకొస్తాయి. ప్రెజెంట్ ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘భాగ్ సాలే’ (Bhaag Saale) 2023లో విడుదలైన తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం. ప్రణీత్ బ్రమందపల్లి దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీ సింహా కోడూరి, నేహా సోలంకి ప్రధాన పాత్రల్లో నటించగా, రాజీవ్ కనకాల, జాన్ విజయ్, నందిని రాయ్, వివా హర్ష, సత్య, సుదర్శన్ సహాయక పాత్రల్లో నటించారు. కాళా భైరవ సంగీతం, రమేష్ కుషేందర్ సినిమాటోగ్రఫీ, కార్తిక శ్రీనివాస్ ఎడిటింగ్‌తో సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్లపై అర్జున్ దస్యాన్, యశ్ రంగినేని, సింగనమల కల్యాణ్ దీనిని నిర్మించారు. ఇది 2023 జూలై 7న థియేటర్లలో విడుదలై, 2023 ఆగస్ట్ 4న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమాకి 5.5/10 రేటింగ్ ఉంది.
కథలోకి వెళ్తే
అర్జున్ ఒక మిడిల్ క్లాస్ యువకుడు. హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తూ, డబ్బున్న వాడిలా నటించి, ధనవంతురాలైన మాయా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అర్జున్ తన ప్రేమను గెలుచుకోవడానికి డబ్బున్నట్లు నమ్మించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ సామ్యూల్ అనే ఒక గ్యాంగ్‌స్టర్, తన కుడిభుజం జాక్సన్ తో కలిసి, షాలీ షుక గజ అనే అరుదైన నిజాం డైమండ్ రింగ్ కోసం మాయా కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. సామ్యూల్ ఈ రింగ్ కోసం ఎన్నో హత్యలు చేసిన రౌడీ. అతను మాయా తండ్రిని కిడ్నాప్ చేసి, రింగ్‌ను రాన్సమ్‌గా డిమాండ్ చేస్తాడు. కానీ మాయా కుటుంబానికి ఆ రింగ్ గురించి ఏమీ తెలియదు. ఇప్పడు అర్జున్, తన ప్రేమను, మాయా తండ్రిని కాపాడేందుకు ఈ రింగ్‌ను ఎలా కనిపెట్టాలి అనే గందరగోళంలో పడతాడు.
ఈ గందరగోళంలో అర్జున్ సామ్యూల్ గ్యాంగ్‌తో ఢీ కొట్టాల్సి వస్తుంది. అతనికి సపోర్ట్‌గా పోలీసు ఆఫీసర్ ప్రామిస్ రెడ్డి, అతని స్నేహితులు ఉంటారు. వీళ్లు కామెడీతో కథను సరదాగా నడిపిస్తారు. అర్జున్ రింగ్ కోసం తన తెలివితేటలు, కామెడీ టైమింగ్‌ను ఉపయోగించి, సామ్యూల్‌తో గొడవ పడుతూ, అనేక ట్విస్ట్‌ల మధ్య కథ ముందుకు సాగుతుంది. రింగ్ ఎవరి దగ్గర ఉంది? సామ్యూల్ ఎందుకు దాని కోసం అంత తాపత్రయం పడుతున్నాడు? అర్జున్ తన ప్రేమను, మాయా తండ్రిని కాపాడగలడా? అనేది కథ క్లైమాక్స్‌లో బయటపడుతుంది. ఈ విషయాలను మీరుకూడా తెలుసుకోవాలనుకుంటే, ఈసినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : అర్దరాత్రి అపహరణ… డేంజరస్ సిటీలో పోలీసులకు చెమటలు పట్టించే కేసులు… ఒక్కో ట్విస్ట్ కు మెంటలెక్కాల్సిందే