BigTV English

OTT Movie : వరుసగా 9 హత్యలు… చంపి గోడలపై వింత రాతలు… హింట్ ఇస్తూ పోలీసులను పరుగులు పెట్టించే సైకో

OTT Movie : వరుసగా 9 హత్యలు… చంపి గోడలపై వింత రాతలు… హింట్ ఇస్తూ పోలీసులను పరుగులు పెట్టించే సైకో

OTT Movie : మలయాళం సినిమాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. చక్కని కథలతో ప్రేక్షకులను ఎంటర్టెన్మెంట్ చేస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి పోలీస్ పాత్రలో అదరగొట్టారు. ఎర్నాకులంలో షూట్ చేసిన ఈ చిత్రం ఒక పోలీసు ఆఫీసర్ వృత్తి, కుటుంబ జీవితం మధ్య జరిగే సంఘటనలను సస్పెన్స్, ఎమోషన్స్‌తో నడిపిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

ఎర్నాకులంలో తొమ్మిది హత్యలు జరుగుతాయి, వాటి వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని తెలుస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ASP డెరిక్ అబ్రహాం (మమ్మూట్టి) అనే ఒక తెలివైన డైనమిక్ పోలీసు ఆఫీసర్‌ను రంగంలోకి దింపుతారు. డెరిక్, కిల్లర్ రాసిన నోట్ ఆధారంగా అతను క్రిస్టియన్ ఎక్స్‌ట్రీమిస్ట్ అని, నాస్తికులను టార్గెట్ చేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఇక ఈ దర్యాప్తులో డెరిక్ స్థానిక సెమినరీలోని బ్రదర్ సైమన్‌ను అరెస్ట్ చేస్తాడు. అతను 10 మందిని చంపాలని ప్లాన్ చేసినట్లు చెబుతాడు. కానీ ఈ కేసు డెరిక్‌ను ఒక ప్రీస్ట్ హత్య వరకు తీసుకెళ్తుంది. దీంతో డెరిక్ డ్యూటీలో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ అవుతాడు.


ఇప్పుడు డెరిక్ వ్యక్తిగత జీవితం కథలోకి వస్తుంది. అతని తమ్ముడు ఫిలిప్ అబ్రహాం (ఆన్సన్ పాల్) తన ప్రేయసి అలీనా (తారుషి) హత్య కేసులో నిందితుడిగా అరెస్టవుతాడు. డెరిక్ డ్యూటీకి ప్రాధాన్యత ఇచ్చే స్వభావం ఉన్నప్పటికీ, తన తమ్ముడి నిర్దోషిత్వంపై నమ్మకంతో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ ప్రక్రియలో డెరిక్, ఫిలిప్ మధ్య సోదర బంధం, వారి గతంలోని విషాదం (తల్లిదండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోవడం) బయటపడతాయి. సినిమా రెండో భాగం ఈ సోదరుల మధ్య ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్, ఫిలిప్ నిర్దోషిత్వాన్ని నిరూపించే డెరిక్ ప్రయత్నాల చుట్టూ తిరుగుతుంది. కథలో డయానా జోసెఫ్ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, ఈ కేసును వాదిస్తాడు. చివర్లో ఒక షాకింగ్ ట్విస్ట్‌తో కథ ముగుస్తుంది. ఫిలిప్ నిజంగానే ఈ హత్య చేశాడా ? డెరిక్ ఇన్వెస్టిగేషన్ ఎలాసాగుతుంది ? ఈ క్లైమాక్స్ షాకింగ్ ట్విస్ట్‌ ఏమిటి ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘అబ్రహామింటే సంతతికల్’ (Abrahaminte Santhathikal) 2018లో విడుదలైన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. షాజీ పడూర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో మమ్మూట్టి (డెరిక్ అబ్రహాం), ఆన్సన్ పాల్ (ఫిలిప్ అబ్రహాం) ప్రధాన పాత్రల్లో నటించగా, కనిహ, సిద్దీఖ్, రెంజి పణిక్కర్, యోగ్ జపీ సహాయక పాత్రల్లో నటించారు. ఇది 2018 జూన్ 16న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం Sun NXT, MX Playerలో అందుబాటులో ఉంది. దీనికి IMDbలో 6.7/10 రేటింగ్ ఉంది.

Related News

OTT Movie : వదిన మీద కన్నేసే మరిది… ఈ క్రైమ్ డ్రామాలో అలాంటి సీన్లే హైలెట్ మావా… సింగిల్ గా చూడాల్సిన సిరీస్

OTT Movie : రాయల్ ఫ్యామిలీ అని మాయ చేసే కేటుగాడు… నిజాం రింగ్ చుట్టూ తిరిగే స్టోరీ… తెలుగులోనే స్ట్రీమింగ్

OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 18 సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

OTT Movie : ఇంట్లోనే శవమై కన్పించే జడ్జ్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్… ఊహించని మలుపులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

OTT Movie: తనకు లవర్‌ ఉన్నా సరే.. ఫ్రెండ్ ప్రేమించే వ్యక్తితో పాడు పనులు చేసే అమ్మాయి, చివరికి..

Big Stories

×