Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 29వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
వంశపారంపర్య వ్యాపారాలని, బాధ్యతలని సమర్థవంతంగా నిర్వహిస్తారు. అత్తవారింటి నుండి బహుమతులు అందుకుంటారు. శుభకార్యాలలో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో కొత్త ప్రయత్నాలతో విజయాలు సాధిస్తారు. అదృష్ట సంఖ్య:6
వృషభ రాశి:
ఈరోజు వృషభ రాశి వారికి ధన యోగం ఉంది. సోదర వర్గం అన్నివిధాలా మీకు తోడుగా ఉంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం విషయంలో శుభవార్త వింటారు.అదృష్ట సంఖ్య:3
మిథున రాశి:
వృత్తి రీత్యా దూరప్రాంతలలో ఉన్నవారు మీ స్వస్థలానికి చేరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. భూవిక్రయాలకై ఆలోచనలు అమలులో పెడుతారు. సోదరులతో స్వల్పంగా విబేధాలు ఏర్పడుతాయి. కలుపుకుని పోవడం మంచిది. అదృష్ట సంఖ్య 8
కర్కాటక రాశి:
మీర ఈరోజు విహార యాత్రలకు ప్రయత్నాలు చేస్తారు. ధర్మ సంబంధమైన ఖర్చులు చేస్తారు. షేర్లలో పెట్టుబడుల వల్ల లాభాలు పొందుతారు. ముఖ్యమైన శుభవార్త వింటారు. అదృష్ట సంఖ్య 2
సింహరాశి:
అధికార ప్రయత్నాలు చేస్తారు. బుద్ధి బలం నిరూపించుకోవడానికి ఇదే మీకు సరేన సమయం. కానీ మిమ్మల్ని అవమానించడానికి కొందరు ప్రయత్నిస్తారు. మీ మనోబలం దైవానుగ్రహం మిమ్మల్ని గెలిపిస్తుంది. అదృష్ట సంఖ్య:1
కన్యారాశి :
అధికారుల అండదండలతో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. ఈరోజు ఆధ్యాత్మిక సేవలో గడుపుతారు. ముఖ్యమైన విషయాలు ఇతరులతో చర్చించకండి. అదృష్ట సంఖ్య: 7
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
https://www.bigtvlive.com/astrology/zodiac-signs-born-most-likely-to-become-rich-know-details.html
తులారాశి:
ఇవాళ మీకు విదేశీ ప్రయాణాలు ఫలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు మొదలుపెడతారు. ప్రేమ సంబంధిత వ్యవహారాలలో విజయం కలుగుతుంది. అదృష్ట సంఖ్య:2
వృశ్చికరాశి:
మనసులో దిగులు పడకండి కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో మంచి విజయం సాధిస్తారు. మానసిక ఆందోళన మిమ్మల్ని కుంగదీస్తుంది. ధైర్యంగా ఉండటం మంచిది. అదృష్ట సంఖ్య:4
ధనస్సు రాశి:
కుటుంబంలో యుద్ధవాతావరణం నెలకొంటుంది. సోదరులు మీపై విపరీతమైన శతృత్వాన్ని పెంచుకుంటారు. ఆస్తితగాదాలలో ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తారు. ఎటువంటి లావాదేవీలు జరుపవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అదృష్ట సంఖ్య: 3
మకరరాశి:
మీ జీవిత భాగస్వామి నుండి విలువైన కానుకలు అందుకుంటారు. తనతో ఎంతో ప్రేమగా గడుపుతారు. ముఖ్యమైన విషయాలు తనతో చర్చిస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయపడుతారు. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు మీ సొంతమవుతాయి. అదృష్టసంఖ్య:3
కుంభరాశి:
రాజకీయ పదవులకోసం విరివిగా ప్రయత్నాలు చేస్తారు. శతృవులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు ఎత్తుగడలు వేస్తారు. స్త్రీ మూలకంగా ధననష్టం ఉంటుంది. తృటిలో ప్రమాదాలను తప్పించుకుంటారు. అదృష్ట సంఖ్య: 9
మీనరాశి:
ఇవాళ మీకు స్థానచలనం కలుగుతుంది. ప్రయాణాల్లో కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. న్యాయవృత్తికి సంబంధించిన ఉద్యోగం సాధిస్తారు. పెద్దల పరిచయాలు ఏర్పడతాయి. అదృష్ట సంఖ్య:3
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే