OTT Movie : ఓటీటీలో ఒక తమిళ సినిమా థ్రిల్లింగ్ అడ్వెంచర్ తో సెగలు పుట్టిస్తోంది. ఈ సినిమా ఒక అడవిలో జరిగే భయంకరమైన సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఫారెస్ట్ సీన్స్‌లో ఇంటెన్స్, సోషల్ మెసేజ్, ఇన్‌స్పైరింగ్ డైలాగ్ లతో ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఓటీటీలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
శక్తి అనే యువతి ప్రాక్టికల్ మైండ్‌సెట్ ఉన్న అమ్మాయి. మూఢనమ్మకాలను అస్సలు నమ్మదు. ఆమె తండ్రి కూడా మూఢనమ్మకాలను ఖండించే వ్యక్తి. కబిలకురిచ్చి గ్రామంలోని నారవగంతం అడవి గురించి ఎక్కువగా పుకార్లు వున్నాయి. ఆ ప్రాంతం హాంటెడ్ అని, అక్కడ ఆత్మలు సంచరిస్తాయని స్థానికులు నమ్ముతారు. శక్తి ఈ కట్టుకథలు బూటకమని నిరూపించాలని అనుకుంటుంది. ఆమె ఈ మిషన్‌లో తన స్నేహితులు ఆలిస్, చార్లెస్ సహాయంతో అడవిలోకి వెళ్తుంది. కానీ అడవిలోకి అడుగుపెట్టగానే వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. శక్తి నమ్మకాలు సడలిపోతాయి. ఆమె మనసులో అనుమానాలు మొదలవుతాయి. అడవిలో హారర్ వైబ్‌ని ఇచ్చే సంఘటనలు జరుగుతాయి. చెట్ల మధ్య ఏదో సంచరిస్తున్నట్టు, నీడలు కదులుతున్నట్టు అనిపిస్తుంది.
అడవిలో జరిగే ఈ అసాధారణ సంఘటనలు శక్తిని మరింత గందరగోళానికి గురి చేస్తాయి. ఆమె స్నేహితులతో కలిసి, ఒక ఆత్మ సహాయంతో అడవి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. గతంలో జరిగిన ఒక దారుణ సంఘటన గురించి ఆ ఆత్మ హింట్స్ ఇస్తుంది. శక్తి ఈ ఆత్మతో మాట్లాడుతూ, అడవిలో జరిగే అసాధారణ సంఘటనల వెనుక ఒక బలమైన కారణం ఉందని తెలుసుకుంటుంది. ఈ ప్రాసెస్‌లో శక్తి గ్రామంలోని మూఢనమ్మకాలను ఛాలెంజ్ చేస్తూ, అడవిలో ధైర్యంగా ముందుకు వెళ్తుంది. క్లైమాక్స్‌లో అడవి వెనుక ఉన్న అసలు సీక్రెట్ బయటపడుతుంది. శక్తి తన మిషన్‌ని ఎలా ముగిస్తుందనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ అడవి సీక్రెట్ ఏమిటి ? శక్తి తన మిషన్‌ని ఎలా పూర్తి చేస్తుంది. శక్తి కి కనబడుతున్న ఆత్మ ఎవరు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
‘వివేసిని’ (Vivesini) భవన్ రాజగోపాలన్ దర్శకత్వంలో వచ్చిన తమిళ హారర్-థ్రిల్లర్ సినిమా. ఇందులో నస్సర్, కవ్యా, సురేష్ చక్రవర్తి, సురజ్, గ్యారీ కార్డిస్, వానెస్సా స్టీవెన్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2019లో మొదలై, కోవిడ్-19 పాండమిక్ వల్ల ఆలస్యమై, 2023 డిసెంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 11 నెలల గ్యాప్ తీసుకుని డిజిటల్ ప్రీమియర్‌గా విడుదలైంది. 2024 నవంబర్ 19 నుండి Aha Tamil లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 14 నిమిషాల రన్‌టైమ్ ఉన్నాయి సినిమా IMDbలో 6.0/10 రేటింగ్ పొందింది.
Read Also : ముసలి భర్త పక్కనుండగా కుర్రాడితో… మెంటలెక్కించే ట్విస్టులు, సర్ప్రైజింగ్ క్లైమాక్స్… ఆ సీన్లు కూడా