OTT Movie : హార్డ్‌కోర్ థ్రిల్లర్ లవర్స్ ను ఒక సస్పెన్స్ ఫుల్ సినిమా సీట్లలోనే కూర్చోబెడుతోంది. బాక్సాఫీస్‌లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ స్టోరీ వయసు తగ్గించే ఒక ఫార్ములా చుట్టూ తిరుగుతుంది. క్లైమాక్స్ వరకు ట్విస్టులే ఉంటాయి. ఎవరు ఎవర్ని మోసం చేస్తున్నారో కూడా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఉత్కంఠ భరితంగాసాగే ఈ సినిమా పేరు ఏమిటి ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
ఈ సినిమా ఆరు ముఖ్య పాత్రల చుట్టూ తిరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్. రామ్ (శ్రీ) అనే బీఎస్సీ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ నిరుద్యోగిగా ఉంటాడు. ఈ సమయంలో ఒక బెడ్‌రిడెన్ వృద్ధ శాస్త్రవేత్తకు కేర్‌టేకర్‌గా ఉద్యోగం పొందుతాడు. ఆ శాస్త్రవేత్త యవ్వన శక్తి పెంచే ఎనర్జీ పిల్ ఫార్ములాను కనిపెడతాడు. దాని సీక్రెట్ ఫార్ములా అతి విలువైనది. ఇంట్లో పంచవర్ణం అనే ఒక పనిమనిషి, డాక్టర్ ప్రవీన్ అనే ఫిజియోథెరపిస్ట్, బాలాజి, కోవై గురుమూర్తి వంటి పాత్రలు కూడా ఉంటాయి. ప్రతి పాత్రకు ఒక అజెండా ఉంటుంది. అక్కడ ఎవరూ నమ్మదగిన వ్యక్తుల్లా ఉండరు. ఫార్ములా వల్ల వచ్చే లాభాల కోసం వారంతా కుట్రలు, మోసాలు, మర్డర్ ప్లాన్‌లు కూడా చేస్తారు.
ముందుగా రామ్ ఈ ఫార్ములా గురించి తెలుసుకుని, పిల్స్ తయారు చేసి అమ్మకానికి పంపి వేగంగా డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బుతో లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాడు. పంచవర్ణంతో సంబంధం కూడా పెట్టుకుంటాడు. కానీ పంచవర్ణం అతన్ని మోసం చేసి, డబ్బును దొంగిలించి పారిపోతుంది. డాక్టర్ ప్రవీన్ కూడా ఫార్ములా కోసం ఆసక్తి చూపిస్తాడు. గ్రే షేడ్స్‌తో కూడిన పాత్రల మధ్య ఇంట్రా ప్లే ఆసక్తికరమైన ట్విస్ట్‌లు తెస్తుంది. ఇందులో మహిళా పాత్రలు కూడా మర్యాద లేకుండా, కౄరత్వంగా చూపబడతాయి. చివరికి ఆ శాస్త్రవేత్త ఏమవుతాడు ? ఆ ఫార్ములా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
‘ప్రాజెక్ట్ సి (చాప్టర్ 2)’ (Project C (Chapter 2) వీఎన్ఓ దర్శకత్వంలో వచ్చిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇందులో శ్రీ, వసుధా కృష్ణమూర్తి, చామ్స్, రామ్జీ, బాలాజి వెంకటరామణ్, కోవై గురుమూర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 డిసెంబర్ 23న తమిళనాడులో విడుదలైన ఈ సినిమా, సస్పెన్స్‌ఫుల్ స్టోరీ టెల్లింగ్‌కు ప్రశంసలు అందుకుంది. IMDbలో 6.6/10 రేటింగ్ ను పొందింది. Watcho ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : గ్రామంలో ఏ మహిళనూ వదలని దొర… పనోడితో దొర పెళ్ళాం… ఈ అరాచకం మాములుగా ఉండదు భయ్యా