BigTV English

OTT Movie : అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే సైకో… వీడికి ఇదేం మాయ రోగం సామీ… క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్

OTT Movie : అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే సైకో… వీడికి ఇదేం మాయ రోగం సామీ… క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్

OTT Movie : మలయాళం సినిమాల ప్రభావంతో ఎక్స్‌పెరిమెంటల్ థ్రిల్లర్‌గా, ఒక తెలుగు సినిమా తెరకెక్కింది. ఈ కథలో ట్విస్ట్‌లు, సస్పెన్స్ హైలైట్‌ గా ఉంటాయి. ఈ సినిమా డైరెక్టర్ కావాలని కలలు కనే ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. అయితే షూటింగ్ సమయంలో ఆర్టిస్ట్ ల మిస్సింగ్ తో స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఈ సినిమా తెలుగు థ్రిల్లర్ లవర్స్‌కు వన్ టైమ్ వాచ్‌గా చెప్పుకోవచ్చు. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివారాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే

ఆశ్విన్ అనే యువకుడు డైరెక్టర్ కావాలని కలలు కని, తన కథను ఒక ప్రొడ్యూసర్ (సునీల్)కు చెప్పి, సినిమా తీయడానికి ప్లాన్ చేస్తాడు. ఆశ్విన్ చెప్పిన కథను ప్రొడ్యూసర్ కి నచ్చడంతో షూటింగ్ మొదలవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రధాన 5 ఆర్టిస్టులు (అలి, రఘు బాబు, సత్యం రాజేష్, మధునందన్, జయప్రకాష్ వంటి పాత్రలు) అనుకోకుండా అదృశ్యమైపోతారు. ఈ ట్విస్ట్ తో ఆశ్విన్ షాక్ అవుతాడు. పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆశ్విన్ తన కథలోని ఎలిమెంట్స్, రియల్ లైఫ్ మధ్య కనెక్షన్ గమనిస్తాడు. ఆర్టిస్టుల మిస్సింగ్ అతని స్క్రిప్ట్‌లోని ఇన్సిడెంట్స్‌తో మ్యాచ్ అవుతోందని అతనికి అర్థమవుతుంది.

కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఆశ్విన్ ఆర్టిస్టులను వెతకడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రతి క్లూ అతని స్క్రిప్ట్‌కు లింక్ అవుతుంది. ఈ సమయంలో ప్రొడ్యూసర్ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇస్తాడు. అతను కథలోని మాస్టర్‌మైండ్‌గా ఉంటాడు. ఇప్పుడు స్టోరీ ట్విస్ట్‌లు, టర్న్స్‌తో ముందుకు వెళ్తుంది. ఆశ్విన్ కథ వెనుక రియల్ మిస్టరీ ఏమిటి ? ఆర్టిస్టులు ఎక్కడికి పోయారు ? ప్రొడ్యూసర్ మోటివ్ ఏమిటి అనేవి సస్పెన్స్ క్రియేట్ చేస్తాయి. ఆశ్విన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేస్తాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.


ఏ ఓటీటీలో ఉందంటే

‘కథ వెనుక కథ’ (Katha Venuka Katha) కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనిని దండమూడి బాక్సాఫీస్ పతాకంపై దండమూడి అవనీంద్ర కుమార్ నిర్మించారు. ఇందులో విస్వంత్ దుడ్డుంపూడి (ఆశ్విన్), శ్రీజితా ఘోష్ (షైలు), సుభ శ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. సునీల్, అలి, రఘు బాబు, సత్యం రాజేష్, మధునందన్, బెనర్జీ, జయప్రకాష్, ధనరాజ్ వంటి వాళ్ళు సపోర్టింగ్ రోల్స్‌లో నటించారు. ష్రావణ్ భారద్వాజ్ సంగీతం, అమర్ రెడ్డి కుడుముల ఎడిటింగ్‌తో ఈ సినిమా 2023 మే 12న థియేటర్లలో విడుదలైంది. 2024 మార్చి 28 నుండి ETV Win ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమా IMDbలో 6.9/10 రేటింగ్ పొందింది.

Read Also : అర్ధరాత్రి అరుపులు… లేని పెళ్ళాం మిస్సింగ్ అంటూ కేసు… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

Related News

OTT Movie : భార్య ఫోన్ లో సీక్రెట్ స్పై యాప్… మ్యారేజ్ యానివర్సరీకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే ఫ్యూజులు అవుటయ్యే షాక్

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో రాత్రి బర్త్ డే పార్టీ… కళ్ళు తెరిచి చూస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… భయాన్నే భయపెట్టే హర్రర్ మూవీ

OTT Movie : ప్రేమ పేరుతో సీక్రెట్ వీడియోలు… లేడీ ఆఫీసర్ ను నిండా ముంచే కేటుగాడు… గ్రిప్పింగ్ స్పై థ్రిల్లర్

OTT Movie : మాట్లాడుకునే చెట్లు… ఆ అడవిలోకి అమ్మాయిలు వెళ్తే తిరిగిరారు… ఒక్కో ట్విస్టుకు మెంటలెక్కాల్సిందే

OTT Movie: ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్లి ఏదో చేస్తారు.. నేపాల్ పోలీసుల అరాచకాన్ని చూపించే మూవీ ఇది

×