Asia Cup 2025 : ఆసియా కప్ 2025 తొలి మ్యాచ్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మధ్య అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో అప్గానిస్తాన్ ఘన విజయం సాధించింది. అయితే ఇవాళ భారత్ వర్సెస్ యూఏఈ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కి సంబంధించి ఓ చిలుక జ్యోతిష్కుడు జోస్యం చెప్పాడు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. ఇండియా వర్సెస్ యూఏఈ ఏది గెలుస్తుందో చిలుక ద్వారా తెలుసుకుందాం. రామ్మా.. చిలుకమ్మ ఏది గెలుస్తుందో చూడమ్మా అంటూ పంజరంలో ఉన్న చిలుకను బయటికి పిలవగా బయటికి వచ్చిన చిలుక ఇండియా బొమ్మను తీసి చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం.
Also Read : AFG vs HK Asia Cup 2025: ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ బోణీ..చిత్తు చిత్తైన హంగాంగ్
చిలుక జోస్యంలో కూడా ఇండియా బొమ్మ ఉండటం.. చిలుక కూడా కరెక్ట్ గా దానినే తీయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి యూఏఈ వర్సెస్ టీమిండియా మధ్య జరిగే మ్యాచ్ లో తప్పకుండా ఇండియా గెలుస్తుంది. ఎందుకంటే.. నెంబర్ వన్ గా ఉన్న ఈ జట్టు కేవలం 2 సార్లు మాత్రమే ఆసియా కప్ లో ఆడుతుంది. భారత్ మాత్రం ఇప్పటివరకు 16 సార్లు తలపడితే.. 8 సార్లు టైటిల్ గెలిచి టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ గురించి ఎవ్వరైనా ఇండియా గెలుస్తుందనే చెబుతారు. కానీ యూఏఈ చిన్న జట్టే అయినా తరుచూ టీ-20లు, టీ-0లు ఆడుతూ పొట్టి క్రికెట్ లో రాటుదేలిన ప్రమాదకర బ్యాటర్లు ఆ జట్టు సొంతం చేసుకోవచ్చు. ఇటీవల పాకిస్తాన్, అప్గానిస్తాన్ లతో కలిసి ఆడిన ముక్కోణపు సిరీస్ లో ఆ జట్టు బ్యాటర్లు సత్తా చాటారు. కెప్టెన్ మహ్మద్ వసీమ్ తో పాటు షరాపు, అసిఫ్ ఖాన్ ఆ సిరీస్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా హైదర్ అలీ, మహ్మద్ రోహిద్, జునైద్ సిద్ధిక్ ల రూపంలో ఆ జట్టుకు ప్రతిభవంతమైన బౌర్లు కూడా అందుబాటులో ఉన్నారు. భారత్ పై విజయం సాధించకపోయినా గట్టి పోటీ ఇవ్వడానికి యూఏఈ ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గ్రూపు దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో హై ఓల్టేజీ వాతావరణం గ్రూపు దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో మాత్రమే హై ఓల్టేజీ వాతావరణం ఉండనుంది. ఆసియా కప్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా విలేకర్లతో మాట్లాడారు. ముందుగా సూర్య.. మైదానంలోకి అడుగు పెట్టిన ప్రతీసారి దూకుడుగానే ఉంటామని.. దూకుడే లేకుంటే ఆటలో కొనసాగలేమని స్పష్టం చేశారు. మరోవైపు పాక్ కెప్టెన్ సల్మాన్ ఎలా ఆడాలో ఎవ్వరికీ ఏమి చెప్పాల్సిన అవసరం లేదని.. ఒక ఆటగాడు దూకుడుగా ఆడాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు. మా ఫాస్ట్ బౌలర్లు మాత్రం ఎప్పుడూ దూకుడుగానే ఉంటారని సల్మాన్ తెలిపాడు.
?igsh=MWRpZDRxbHA2dTJxcw==