Actress Sudha : సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీనటులకు అందరికి ఏదొక స్టోరీ ఉండనే ఉంటుంది. సినిమాల్లో అందరిని నవ్వించే నటుల జీవితం గతంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించేందుకు కష్టపడి సినిమాల్లోకి వచ్చారు. ఇక్కడ ఎంతో కష్టపడి తమ టాలెంట్ తో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. వారి నటనతో ప్రేక్షకుల మనసును దోచుకొని వారి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలా ఎంతో మంది స్టోరీలు వింటే ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇప్పుడు నటి సుధ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె చెప్పి అందరిని ఏడ్పించేసింది.. ఆమె ఎదుర్కొన్న కష్టాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..
నటి సుధ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఈమెకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో వందల చిత్రాల్లో ఆమె నటనతో ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకుంది. ఇండస్ట్రీలోకి స్టార్ హీరోలకు వదినగా, తల్లిగా, అత్తగా, సహాయకనటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండగలమని .. ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సూచిచడం తో అలా సెటిల్ అయ్యారు. నటి సుధ తమిళనాడు శ్రీరంగంలో మంచి స్థితిమంతుల కుటుంబంలో పుట్టింది.. అక్కడే విద్యాబ్యాసం కూడా చేసింది. అయితే తమిళనాడు అయినా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది.. అల్లు రామలింగయ్య సలహా తో తెలుగు పై శ్రద్ధ పెట్టి.. సొంతగా డబ్బింగ్ చెప్పడంతో మంచి అవకాశాలు వచ్చాయి. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుధ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం ఒడిదొడుగులు ఎదుర్కొంది.. ఎన్నో అవమానాలు దిగిమింగింది. కొన్ని హోటల్స్ బిజినెస్ లోకి దిగాక సర్వం కోల్పోయినట్లు ఆమె చెప్పింది.
ఇక కట్టుకున్న భర్త బిజినెస్ లో నష్టాలు రావడం తో ఎక్కడికో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పింది. కన్న కొడుకు ఉన్నా కూడా లేనట్లే.. ఫారిన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయ్యాడట. ఆ తర్వాత మాటలు కుడా లేవని చెప్పి కన్నీళ్లు పెట్టించింది. అయిన వాళ్ళు లేరని చెప్పి బాధపడింది. ఇక చిన్నతనంలోనే తల్లిని పొగొట్టుకున్న సుధ పెద్దయ్యాక తన తండ్రికి క్యాన్సర్ సోకిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నా కూడా కనీసం కన్నెత్తి చూడలేదని.. తన తండ్రి కాలం చేసేవరకు తానే చూసుకున్నట్లు తెలిపారు. గోల్డెన్ స్ఫూన్ లో పుట్టిన పెరిగిన తాను తండ్రి అనారోగ్యం కారణంగా అన్నీ కోల్పోయి రోడ్డున పరిస్థితి చవిచూసిందట. నాన్న అనారోగ్యానికి గురైన తర్వాత వారి జీవితం దారుణంగా మారిందట. అమ్మ తన మంగళసూత్రం అమ్మి మాకు భోజనం పెట్టింది ఒక్కసారిగా మా జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆమె అన్నారు. ఆమె ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడం తో నెటిజన్లు ఆమె కష్టాల ను విని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె వరుస సినిమాల్లో నటిస్తుంది.