BigTV English

OTT Movie : హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని రూమ్ కి వెళ్తే… గుండెల్లో గుబులు పుట్టించే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని రూమ్ కి వెళ్తే… గుండెల్లో గుబులు పుట్టించే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఈ సైకో సినిమాలో చూస్తున్నంత సేపు వెన్నులో వణుకు పుడుతుంది. వీళ్ళు చేసే హింసను చూస్తే దయ్యాలే నయం అనిపిస్తుంది. అంతలా నరకం చూపించి చంపుతుంటారు ఈ సైకోలు. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో కూడా అంతే హింస ఉంటుంది. కూతురిపై ఆఘా యిత్యం చేసే తండ్రి చీకటి కోణం దారుణంగా ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘వైన్ విల్లే’ (Wineville). 2023 రిలీజ్ అయిన ఈ మూవీకి బ్రాండే రోడరిక్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ 1970ల నేపథ్యంలో సెట్ చేయబడింది. ఒక మహిళ జీవితంలోని చీకటి అంశాలను చూపిస్తుంది. చిన్నప్పుడు తన తండ్రివల్ల టెస్ నరకం అనుభవించి ఉంటుంది.ఫిజికల్ గా ఆమెను టార్చర్ చేసి ఉంటాడు.ఆ తరువాత ఇందులో హింసాత్మక సంఘటనలు కథను ముందుకు నడిపిస్తాయి.ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

టెస్ అనే మహిళ చాలా కాలం తరువాత ఇంటికి తిరిగి వస్తుంటుంది. ఆమెను తన తండ్రి చిన్నప్పుడు ఫిజికల్ గా చాలా ఇబ్బందిపెట్టి ఉంటాడు. తన బాల్యంలో తన తండ్రి చేసే అటువంటి పనులవాళ్ళ భయపడి ఇంట్లో నుంచి సిటీ కి పారిపోతుంది.అక్కడ తన కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇప్పుడు అతను చనిపోవడంతో ఇంటికి తిరగి వస్తుంది. అతని వారసత్వంగా ఉన్న వైన్‌యార్డ్ వ్యవహారాలను సర్దుకోవడానికి, ఆమె తన కొడుకు వాల్టర్ తో కలిసి ఆ ప్రాంతానికి వస్తుంది. ఈ వైన్‌యార్డ్ లాట్ వైన్‌యార్డ్స్ అని పిలుస్తుంటారు. ఇది ఒకప్పుడు ఆమె కుటుంబానికి చెందినది.టెస్ తిరిగి వచ్చినప్పుడు. ఆమె తన అత్త మార్గరెట్, స్థానికంగా ఉండే కూలీ జో ని కలుస్తుంది.వాళ్ళిద్దరూ ఆ వైన్‌యార్డ్ ను చూసుకుంటూ ఉంటారు. ఈ వైన్‌యార్డ్ ఒక సాధారణ ఆస్తిగా కనిపించినా,దాని వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాలు ఆమెను వెంటాడతాయి. ఆమె బాల్యంలో తన తండ్రి నుండి ఎదుర్కొన్న చీకటి జ్ఞాపకాలు ఆమెను తిరిగి వెంటాడుతాయి.

అదే సమయంలో, స్థానిక పోలీస్ ఈ ప్రాంతంలో అదృశ్యమైన పర్యాటకుల గురించి, అనుమానాస్పద ప్రశ్నలు వేస్తాడు. ఇది టెస్‌కు మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. కథ ముందుకు సాగే కొద్దీ, టెస్ తన కుటుంబం గురించి, భయంకరమైన రహస్యాలను కనుగొంటుంది. వైన్‌యార్డ్ లో జరిగే కొన్ని భయానక సంఘటనలు, రక్తపాతం, శారీరక హింస దృశ్యాలు వణుకు తెప్పించే విధంగా ఉంటాయి. ఈ రహస్యాలు ఆమె తండ్రి చీకటి వారసత్వంతో ముడిపడి ఉంటాయి. అందుకు తగ్గట్టే ఇప్పుడు వైన్‌యార్డ్ ను చూసుకుంటున్న ఆమె అత్త కూడా ఒక సైకో అని తెలుస్తుంది. ఇప్పుడు టెస్ ఈ ఆస్తిని అమ్మాలా లేక ఉంచాలా అనే అయోమయంలో పడుతుంది. చివరికి టెస్ వైన్‌యార్డ్ ను అమ్మేస్తుందా ? తన అత్తతో సమస్యలు వస్తాయా ?వైన్‌యార్డ్ లో మిస్ అవుతున్న మనుషులు ఏమౌతుంటారు ?ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

Big Stories

×