Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా… నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Mumbai Indians vs Gujarat Titans ) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన గుజరాత్ టైటాన్స్ మొదటి విక్టరీ నమోదు చేస్తుంది. ముంబై ఇండియన్స్ జట్టుపైన 36 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్. సాయి సుదర్శన్ అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు మహమ్మద్ సిరాజ్ అలాగే ప్రసిద్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
హార్దిక్ పాండ్యా వర్సెస్ సాయి కిషోర్
ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా… గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ ఇద్దరు మధ్య… చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో సాయి కిషోర్ బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో అతని పైకి కొట్టేస్తా అన్న తరహాలో హార్దిక్ పాండ్యా మీదకు వెళ్లాడు. దీంతో సాయి కిషోర్ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. కళ్ళు పెద్దగా చేసి… హార్దిక్ పాండ్యా వైపు చూశాడు సాయి కిషోర్. దీంతో హార్దిక్ పాండ్యా కూడా చల్లబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 15 వ ఓవర్ వేసేందుకు సాయి కిషోర్ వచ్చాడు. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ అప్పటికే నాలుగు వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హార్దిక్ పాండ్యా ఏడు బంతుల్లో ఏడు పరుగులు చేశాడు. ఈ తరుణంలోని ఈ సంఘటన జరిగింది.
శాంతించిన హార్దిక్ పాండ్యా
అయితే బ్యాటింగ్ చేసే సమయంలో… గుజరాత్ టైటాన్స్ బౌలర్ సాయి కిషోర్ ( Sai Kishore) పైన రెచ్చిపోయిన హార్దిక్ పాండ్యా… ఆ తర్వాత శాంతించాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత… సాయి కిషోర్ కు ఒక హగ్ ఇచ్చాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవ చల్లారిందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా… ఎవరైనా అలా గొడవపడాల్సిందేనని… మ్యాచ్ పూర్తయిన తర్వాత శాంతించాలని ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో గుజరాత్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కూడా సాయి కిషోర్ పని చేశాడు.
ఇది ఇలా ఉండగా… నిన్నటి మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) మొదట బౌలింగ్ చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ తరుణంలోని నిర్ణీత 20 ఓవర్లలో… 8 వికెట్లు నష్టపోయి గుజరాత్ టైటాన్స్ 196 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని… చేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో… 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 36 పరుగు తేడాతో ఓడిపోవలసి వచ్చింది ముంబై ఇండియన్స్.
Lafda between Hardik and Sai Kishore pic.twitter.com/0DIkSd7PXH
— Parv 🚩 (@ParvCryEmoji) March 29, 2025
Hardik Pandya hugging Sai Kishore after the match – A lovely moment 🤍 pic.twitter.com/uRUy20InDE
— Johns. (@CricCrazyJohns) March 29, 2025