Gundeninda GudiGantalu Today episode march 30th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఊర్లో అంత చూసుకుంటూ సరదాగా నడుచుకుంటూ అందరూ వెళ్లిపోతారు. శృతి మధ్యలో ఆవు పేడ మీద కాలు వేయడంతో రవి పై సీరియస్ అవుతుంది. చి చి అసలు ఏంటి తంతా రవి అని అంటుంది. మరేం పర్లేదు డబ్బుడమ్మ ఇంటికెళ్లేంతవరకు ఏ గడ్డికో కంప తుడుచుకొని వెళ్తే సరిపోతుంది అని బాలు అంటాడు. ఏంటి ఇంటి వరకు ఇలానే రావాలా అని శ్రుతి అనగానే ఏంటండీ మీరు ఊరుకోండి. ఇక్కడ వాటర్ ట్యాప్ ఉంది రా శృతి కాలు కడుక్కుందువని మీనా తీసుకుని వెళ్తుంది.. శృతి కాల్ కడుక్కుంటుంది ఇక అందరూ నడుచుకుంటూ ఇంటికి వెళ్లి పోతారు. సుశీల ఇంట్లో వాళ్ళందరూ వస్తున్నారని హడావిడి చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ప్రోమో విషయానికొస్తే.. సత్యం పిల్లలు వచ్చారని సుశీల సంతోషంగా ఉంటుంది.. అయితే ఇంట్లోకి వెళ్లగానే శృతి షీలా ప్రేమకు ఫిదా అవుతుంది.. శృతి కూడా రవి వాళ్ళ నానమ్మకు బాగా నచ్చేస్తుంది.. మనోజ్‌కు, రవికి రెండు రూమ్స్ చూపించి అందులోకి వెళ్లమంటుంది ప్రభావతి. చూశావా నాన్నా.. వాళ్లిద్దరు ఆస్తులు ఉన్నోల్లు కాబట్టి బెడ్స్ ఉన్న గదిల్లోకి పంపించింది. నేను డ్రైవర్‌ను, నా భార్య పూలమ్మేది కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నేను ఈ నేలపైనా అయినా పడుకుంటాను. కానీ, నా భార్య సంగతి చూసుకోవాలిగా. ఇబ్బంది పెట్టకూడదుగా అని బాలు అంటాడు..
అది విన్న షీలా వెంటనే మీకు ఏం ఖర్మ రా బాబు.. నా ముద్దుల మనవడిని బయట పడుకొనిస్తానా? నువ్వు నా రూమ్ లో పడుకో అని అంటుంది. మీరు ఉన్నన్ని రోజులు ప్రభావతి ఈ నేలపైనే పడుకోవాలి అని సుశీల ఆర్డర్ వేస్తుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. నీకు నవారు మంచం ఇస్తానురా అని సత్యంతో అంటుంది సుశీల. దాంతో నవ్వేసిన సత్యం.. అది పెద్దరాయుడు తీర్పు. ఇకపై నేలపైనే పడుకోవాలి. మనోజ్, రవికి గదులు ఇచ్చి బాలును మాత్రం పట్టించుకోనందుకు నీకు మా అమ్మ వేస్తున్న శిక్ష ఇది అని అంటాడు..
ఇకపోతే రూమ్ లోకి వెళ్లిన మనోజ్ అక్కడ ఎలా ఉండాలో అని ఆలోచిస్తాడు. కానీ రోహిణి మనోజ్ కె కౌంటర్ వేస్తుంది. మన రూమే అగ్గిపెట్టేలా ఉంటుంది. ఇది చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉంది. మనింటికి ఎవరైనా వస్తే ఆరు బయట పడుకోవాలి. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. ఏదో పారిస్ నుంచి వచ్చినట్లు ఫోజు కొడతావేంటీ అని మనోజ్‌కు రోహిణి చురకలు వేస్తుంది.. అవును మీ మామయ్య మలేషియా నుంచి వస్తున్నాడు కదా ఇక్కడ ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. దానికి రోహిణి ఆలోచనలో పడుతుంది. ఇక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకుండా డౌట్ వస్తుంది. వెంటనే ఫారెన్ నుంచి వచ్చినట్లు బిహేవ్ చేయమని చెప్పాలి అని అనుకుంటుంది రోహిణి. ఇక మనోజ్‌తో మలేషియా మావయ్య ఇక్కడ కంఫర్టుబుల్‌గా ఉంటారో లేదో. మంచి రూమ్ చూసి ఇవ్వాలి. మనం ఉంటున్న గదే ఇచ్చి మనం వేరే చోట ఉందామని రోహిణి అంటుంది.
మనోజ్ మరింత చిరాకు పడతాడు. ఆయన వస్తే మనం వేరే గదిలోకి వెళ్లడం ఏంటీ అని కసురుకుంటాడు. ఇదే విషయం ప్రభావతికి చెబితే మనోజ్‌కు సర్దిచెబుతుంది. తర్వాత రోహిణి మావయ్య గురించి బాలు మీనాతో మాట్లాడుతాడు. నాకెందుకు ఆ పార్లరమ్మను చూస్తుంటే తేడా కొడుతుంది. ఎందుకో టెన్షన్ పడుతుంది.. అని బాలు అనగానే మీనా ఊరుకోండి అందరి మీద మీకు అనుమానం వస్తుంది అంటుంది. లేదు ఏదో ఉంది కనిపెడతాను అని బాలు అంటాడు. కానీ మీనా మాత్రం మనకెందుకులెండి ఊరుకోండి అని ఎంత చెప్పినా బాలు వినడు. ఈ పాలరమ్మ అసలు రహస్యమేంటో కచ్చితంగా కనిపెడతానని శపధం చేస్తాడు. ఇక మీనా పై ప్రేమలు కురిపిస్తాడు. సుశీల మీనా ను ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది. అది చూసిన రోహిణి కుళ్ళుకుంటుంది. ప్రభావతి కూడా మీనా పై ఈవిడ గారు చూపిస్తున్న ప్రేమ మరి ఎక్కువైంది అంటూ కామెంట్ చేస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఆ తర్వాత మలేషియా మామ ఎంట్రీ ఇస్తాడు. అతనిపై బాలు కన్నేస్తాడు. రోహిణి డ్రామా బయట పడుతుందా? మలేషియా మావని అందరూ నమ్ముతారా అన్నది ఆసక్తిగా మారింది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..