BigTV English

OTT Movie : అమ్మాయి మిస్సింగ్… అదిరిపోయే ఇన్వెస్టిగేషన్… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : అమ్మాయి మిస్సింగ్… అదిరిపోయే ఇన్వెస్టిగేషన్… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : మలయాళం సినిమాలకి, రోజు రోజుకి అభిమానులు పెరుగుతున్నారు. సింపుల్ కథలను చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు మలయాళం మేకర్స్. ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో ఒక అడుగు ముందే ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో ఒక అమ్మాయి అనుకోకుండా కిడ్నాప్ అవుతుంది. ఆ అమ్మాయి ఏమైంది అనేది చివరి వరకు సస్పెన్స్ గానే సాగుతుంది. ఈ మలయాళం మూవీలో ట్విస్టులు ఎక్కువగానే ఉంటాయి. చివరి వరకు ఉత్కంఠంగా సాగే ఈ సినిమా పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళ్తే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Y’. 2017 లో విడుదలైన ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు సునీల్ ఇబ్రహీం దర్శకత్వం వహించారు. ఇది నవంబర్ 17 ,2017న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో రాత్రి పూట ఒక వీధిలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అక్కడ ఉన్న వున్న వాళ్ళు ఆ సంఘటనలకు ఎలా స్పందిస్తారనే దాని చుట్టూ తిరుగుతుంది. ఇందులో దీరజ్ డెన్నీ,అలెన్సియర్ లే లోపెజ్,జిన్స్ బాస్కర్,రేష్మా షెనాయ్ కొత్త నటీనటులు నటించారు. దాదాపు 40 మంది కొత్త వారిని పరిచయం చేసిన ఘనత దర్శకుడు సునీల్ ఇబ్రహీంకు దక్కింది.’టైమ్స్ ఆఫ్ ఇండియా’ఈ సినిమాకు 3.5/5 రేటింగ్ ఇచ్చింది. థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ మలయాళం మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

అరుణ్, టీనా తిరువనంతపురంలోని ఒక షాపింగ్ వీధిలో రాత్రి పూట సమయం గడుపుతూ ఉంటారు. కొంతమంది గుండాలు వారిని ఎగతాళి చేయడంతో గొడవ మొదలవుతుంది. అక్కడ గొడవ జరిగిన తర్వాత, టీనా అకస్మాత్తుగా కిడ్నాప్ అవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఆమెకు మత్తు ఇచ్చి తీసుకెళ్లిపోతారు. అరుణ్ అక్కడ ఉన్న కొంతమంది ఆటో డ్రైవర్లు ఆమెను వెతకడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆమె ఆ ప్రాంతంలో ఎక్కడా కనిపించదు. సమీపంలోని ఒక ఫ్లాట్‌లో కి ఆమెను కిడ్నాపర్లు తీసుకొని పోతారు. ఆయినప్పటికి ఆమెను కనిపెట్టలేక పోతారు అక్కడ వున్న వాళ్ళు. పోలీసులు ఈ అమ్మాయిని కనిపెట్టడానికి ప్రయత్నిస్తారు. కొంత మంది పై అనుమానం కూడా వ్యక్తం చేస్తారు పోలీసులు. వాళ్ళను విచారించి కూడా లాభం లేకుండాపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆమె ఆచూకీ దొరకడం వాళ్ళకు కూడా కష్టం గా మారుతుంది. చివరికి ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు ?ఎందుకు చేశారు ? పోలీసులు ఆమెను కనిపెడతారా? అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళం మూవీని చూసి తెలుసుకోవాల్సిందే . ఈ స్టోరీలో అనేక ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉన్నాయి. ఇది ప్రేక్షకులను చివరి వరకు సీట్లకు అతు క్కునేలా చేస్తుంది. మీరుకూడా ఈ మలయాళం సినిమాని చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×