BigTV English

OTT Movie: తండ్రిని ప్రేమించే కూతురు … భార్యలా మారి రచ్చ రచ్చ

OTT Movie: తండ్రిని ప్రేమించే కూతురు … భార్యలా మారి రచ్చ రచ్చ

OTT Movie : హాలీవుడ్ సినిమాలను మన ప్రేక్షకులు ఎక్కువగానే ఫాలో అవుతారు. వాళ్లు తీసే సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు ఉత్కంఠంగా ఉంటాయి. ఈ కథలు కూడా లోతుగా, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక ప్రమాదంలో చనిపోయిన తల్లి ఆత్మ కూతురు బాడిలోకి వస్తుంది. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఫ్లెక్స్ (Plex) లో 

ఈ హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది సీక్రెట్’ (The Secret). ఈ మూవీకి విన్సెంట్ పెరెజ్ దర్శకత్వం వహించారు. ఇందులో డేవిడ్ డుచోవ్నీ, ఒలివియా థర్ల్బీ, లిలీ టేలర్ నటించారు. ఇది 1999 లో హిరోషి సైటో రచించి, యసుహిరో మాస్ నిర్మించిన జపనీస్ మూవీ యజిరో తకిటాకి రీమేక్ గా వచ్చింది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

హనా, బెన్ ఇద్దరు భార్య భర్తలు వారి వృత్తుల్లో బిజీగా ఉంటారు. బెన్ డాక్టర్ గా ఉంటూ ఫ్యామిలీని సంతోషంగా చూసుకుంటాడు. వీళ్ళకు సామ్ అనే కూతురు కూడా ఉంటుంది. సామ్ ఒక స్కూల్ లో చదువుకుంటూ ఉంటుంది. ఒకరోజు తల్లి, కూతుర్లు ఒక కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడతారు. ఈ ప్రమాదంలో కూతురు కోమాలోకి వెళ్ళిపోతుంది. హనా కూడా తీవ్రంగా గాయపడి ఉంటుంది. అదే సమయంలో కూతురును చూస్తూ, ఆమె చేయి పట్టుకొని చనిపోతుంది. ఆ తర్వాత సామ్ కోమాలో నుంచి బయటకు వస్తుంది. అప్పటినుంచి ఆమె బెన్ కి కూతురిగా కాకుండా, భార్యలా ప్రవర్తిస్తుంది. ఆమె అతనితో గడిపిన సన్నివేశాలను కూడా చెప్తుంది. అయితే ఇదంతా తల్లి, కూతురికి చెప్పి ఉంటుందని తేలిగ్గా తీసుకుంటాడు బెన్. తల్లి చనిపోయిందనే షాక్ లో ఉండి, తాను అలా మాట్లాడుతుందని అనుకుంటాడు. స్కూల్ లో కూడా ఆమె ఎవరినీ గుర్తు పట్టలేకుండా ఉంటుంది.

ఆ తరువాత బెన్ తో ఫిజికల్ గా కలవాలి అనుకుంటుంది. అయితే బెన్ ఆమెను కొంచెం దూరం పెడతాడు. కూతురు శరీరంతో నేను ఆ పని చేయలేనని చెప్తాడు. ఆ తర్వాత ఆమె చెప్పేవన్నీ విని కంగారుపడి, ఒక మానసిక డాక్టర్ ని కూడా సంప్రదిస్తాడు. అయితే ఆ డాక్టర్ కొద్ది రోజుల తర్వాత నయం అవుతుందని ధైర్యం చెప్తాడు. మరోవైపు బెన్ తన కూతురులో భార్య ఆత్మ ఉందని అనుకుంటాడు. అయితే కూతురు ఆత్మ ఏమై ఉంటుందనే ఆలోచనలో పడతాడు. ఒక రోజు తన భార్య సమాధి దగ్గరకు వెళ్ళి, ఆమెను తలచుకుని బాధపడతాడు. చివరికి సామ్ శరీరంలో నుంచి హనావెళ్లి పోతుందా? బెన్ ఈ సమస్య నుంచి బయట పడతాడా? ఈ విషయలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×