BigTV English

OTT Movie : ఒంటరి ఆంటీని ఒక పట్టు పట్టే కుర్రాడు… ఈ లవ్ స్టోరీకి దండం పెట్టాలిరా నాయనా

OTT Movie : ఒంటరి ఆంటీని ఒక పట్టు పట్టే కుర్రాడు… ఈ లవ్ స్టోరీకి దండం పెట్టాలిరా నాయనా

OTT Movie : ఓటీటీ లో వెబ్ సిరీస్ ల సందడి కొనసాగుతూనే ఉంది. వీటిని ఎక్కువగా చూడటం మొదలు పెట్టారు మూవీ లవర్స్. దర్శకులు కూడా కొత్త కొత్త కధలను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునే సిరీస్ భారతదేశానికి  స్వాతంత్రం వచ్చిన తరువాత జరుగుతుంది. అప్పటి పరిస్తితులకు తగ్గట్టు ఈ స్టోరీని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..


నెట్ ఫ్లిక్స్ (NetFlix) లో

ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఎ సూటబుల్ బాయ్’ (A Suitable Boy). ఈ వెబ్ సిరీస్ కు మీరా నాయర్ దర్శకత్వం వహించారు. 1993 లో విక్రమ్ సేథ్ రచించిన నవల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ లో టబు, ఇషాన్ ఖట్టర్, రసిక దుగల్, మహిరా కక్కర్, రామ్ కపూర్, నమిత్ దాస్, వివాన్ షా, మిఖాయిల్ సేన్, దనేష్ రిజ్వీ, షహానా గోస్వామి, రణ్‌వీర్ షోరే, విజయ్ వర్మ వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 1951లో  స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని ఒక పట్టణం బ్రహ్మపూర్‌లో ఈ స్టోరీ జరుగుతుంది. ఈ సిరీస్‌ నాలుగు కుటుంబాల చుట్టూ తిరుగుతుంది. ప్రధానంగా లతా మెహ్రా అనే 19 ఏళ్ల విద్యార్థిని, ఆమె తల్లి రూపా మెహ్రాల మధ్య స్టోరీ సాగుతుంది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ (NetFlix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

లతా మెహ్రా అనే యువతి తన సోదరి సవితా వివాహానికి హాజరవుతుంది. సవితా, ప్రాన్ కపూర్ అనే లెక్చరర్‌ను వివాహం చేసుకుంటుంది. ఈ వివాహం తర్వాత, లతా తల్లి రూపా మెహ్రా కూడా లతాకు సరైన అబ్బాయిని వెతకాలని నిర్ణయించుకుంటుంది. అయితే లతా తల్లి ఒత్తిడికి లొంగకుండా, తన చదువు మీద ఇంట్రెస్ట్ పెడుతుంది. ఆ తరువాత లతా బ్రహ్మపూర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు, కబీర్ దుర్రానీ అనే విద్యార్థితో పరిచయం ఏర్పడుతుంది. వీళ్ళు రహస్యంగా కలుసుకోవడం ప్రారంభిస్తారు. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే కబీర్ ముస్లిం కావడం, లతా హిందూ కుటుంబానికి చెందినది కావడంతో, ఆమె తల్లి ఈ సంబంధాన్ని అంగీకరించదని తెలుసుకుంటుంది. ఈ సంఘర్షణ లతా జీవితంలో పెద్ద సవాలుగా మారుతుంది. ఇదే సమయంలో, హరేష్ ఖన్నా, అమిత్ చటర్జీ లలో ఒకర్ని ఎంపిక చేసుకునే పరిస్తితి లతా కి  వస్తుంది. చివరికి లతా తన ప్రేమను వదులుకొని, తల్లి ఆశలకు అనుగుణంగా, తనకు ఇష్టం లేకపోయినా హరేష్‌ను వివాహం చేసుకుంటుంది.

మరోవైపు మాన్ కపూర్ కథ కూడా సమాంతరంగా నడుస్తుంది. మాన్ ఒక రాజకీయ నాయకుడైన మహేష్ కపూర్ కుమారుడు. సయీదా బాయ్ అనే మహిళ ప్రేమలో పడతాడు. వారి సంబంధం సమాజంలో వివాదాస్పదంగా మారుతుంది. మాన్, సయీదా బాయ్ కథ కూడా ఒక విషాదకరమైన మలుపు తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ భారతదేశంలోని  సామాజిక, రాజకీయ మార్పులను చూపిస్తుంది. హిందూ ముస్లిం ఉద్రిక్తతలు, జమీందారీ వ్యవస్థ ముగింపు, స్త్రీల స్వేచ్ఛ కోసం పోరాటం వంటి అంశాలు ఈ స్టోరీలో ఉంటాయి. లత తన భవిష్యత్తును తానే నిర్ణయించుకోవాలనే తపన, మాన్ తన ప్రేమ కోసం చేసే సాహసాలు ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

Tags

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×