Shakeela on OTT : ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘షకీలా’ (Shakeela). పాన్ ఇండియా మూవీగా రూపొందిన ‘షకీలా’ బయోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా (Richa Chaddha) మెయిన్ లీడ్ గా నటించింది. ప్రముఖ దర్శకడు ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన చాలా కాలం తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…
ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి…
షకీలా మూవీలో రిచా చద్దాతో పాటు పంకజ్ త్రిపాఠి, రాజీవ్ పిళ్లై, ఎస్తేర్ నోరాన్హా వంటి ప్రముఖ నటీనటులు కీలకపాత్రలు పోషించారు. 2020 డిసెంబర్లోనే ఈ బయోపిక్ థియేటర్లోకి వచ్చింది. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లోనే హెచ్డి ప్రింట్ ప్రైవసీ వెర్షన్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి రావడంతో మూవీ కలెక్షన్స్ పై స్ట్రాంగ్ ఎఫెక్ట్ పడింది.
షకీలా జీవితం గురించి ప్రపంచానికి తెలియని అసలైన నిజాలను సినిమాలో చూపించబోతున్నామని డైరెక్టర్ ఇంద్రజిత్ లంకేష్ ప్రమోషన్స్ లో స్టేట్మెంట్ ఇచ్చి, సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాడు. కానీ ఎంతో ఆశతో థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. ‘షకీలా’ అసలు ఎందుకు అలాంటి బో*ల్డ్ సినిమాలు తీయాల్సి వచ్చింది? అనే విషయాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చూపించడంలో డైరెక్టర్ తడబడ్డారు. పైగా మూవీ పెద్దలకు మాత్రమే అన్నట్టుగా ఉందనే విమర్శలు విన్పించాయి.
ఏదైతేనేం ఈ మూవీ ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండడం షకీలా అభిమానులకు గుడ్ న్యూస్. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ప్రస్తుతం ఈ మూవీ అందుబాటులో ఉంది. అయితే ఈ ఓటీటీలో కేవలం ఈ మూవీ హిందీ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం. అలాగే ఈ మూవీ హిందీ వెర్షన్ షిమారో ఓటిటితోపాటు ఓటీటీ ప్లే అనే మరో ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా అవైలబుల్ గా ఉంది.
‘షకీలా’ కథ
షకీలా తల్లి ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో పని చేస్తుంది. కుటుంబం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఆ తల్లి షకీలాను సినిమాల్లో నటించాలని బలవంతం చేస్తుంది. తనకు ఇష్టం లేకపోయినా సరే తల్లి బలవంతం, కుటుంబ బాధ్యతల కారణంగా ఆమె బో*ల్డ్ సినిమాలలో నటించడానికి అంగీకరిస్తుంది. అయితే కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోలను సైతం మించిపోయే రేంజ్ లో పాపులర్ అవుతుంది ఈ బ్యూటీ. అలాంటి టైంలో మలయాళ స్టార్ హీరో సలీం షకీలాకు వచ్చిన క్రేజ్ ను చూసి, ఆమె పాపులారిటీని దిగజార్చడానికి కుట్రలు చేస్తాడు. ఆ తర్వాత సలీం వల్ల షకీరా జీవితం ఎలా మారింది? అసలు సలీంకి, షకీరాకు మధ్య ఉన్న గొడవ ఏంటి? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని ఓటీటీలో చూడాల్సిందే. కానీ ఈ మూవీ తెలుగులో అందుబాటులో లేకపోవడం, కేవలం హిందీలోనే స్ట్రీమింగ్ అవుతుండడం గమనార్హం.