MLA Balakrishna: హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ మళ్లీ ఫైర్ అయ్యారు. ఇటీవల బాలకృష్ణ ఫైర్ తగ్గిందిలే అనుకుంటున్న సమయంలో మళ్లీ తన ప్రతాపం చూపారు. అది కూడా తనతో ఫోటోతో దిగిన వారిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అసలేం జరిగిందంటే..
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరన్న విషయం అందరికీ తెలిసిందే. కృష్ణా జిల్లాలోని నిమ్మకూరుకు గురువారం బాలకృష్ణ వెళ్లారు. అక్కడ తన స్నేహితులతో సరదాగా మాట్లాడారు. అలాగే అభిమానులను పలకరించారు. బాలకృష్ణ స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం అందుకున్న ఇతర గ్రామాలకు చెందిన వారు కూడా అక్కడికి వెళ్లారు. సాధరణంగా బాలకృష్ణ మనస్తత్వం చిన్నపిల్లాడిలా ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అయితే నిమ్మకూరులో ఓపికగా అందరితో బాలకృష్ణ ఫోటోలు దిగారు. ఇక్కడే ఓ సంఘటన జరిగింది.
సీనియర్ ఎన్టీఆర్ సతీమణి, బాలకృష్ణ తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు. బాలకృష్ణ నిమ్మకూరుకు వచ్చినట్లు తెలుసుకున్న కొమరవోలు గ్రామస్థులు బాలకృష్ణ వద్దకు వచ్చారు. వారి యోగక్షేమాలను బాలకృష్ణ అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఫోటోలు దిగేందుకు గ్రామస్థులు ఆసక్తి చూపారు. బాలకృష్ణ కూడా వారితో ఫోటోలు దిగారు. ఆ తర్వాత కొమరవోలు గ్రామస్థులు తమ గ్రామాన్ని పట్టించుకోండి అంటూ సూచించారు. ఇక అంతే బాలకృష్ణలో కోపం కట్టలు తెంచుకుంది. ఔను పట్టించుకోను.. ఫోటోలు దిగారు ఇక వెళ్లిపోండి.. అంతేకానీ ఇదేంటిది అంటూ బాలకృష్ణ ఫైర్ అయ్యారు.
ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని, తన స్నేహితులతో మాటలు కలిపారు బాలకృష్ణ. గతంలో పలుమార్లు అభిమానులను బాలకృష్ణ కొట్టిన ఘటనలు ఉన్నాయి. తన సమీపానికి ఎవరైనా వచ్చి విసిగిస్తే చాలు, బాలకృష్ణ ఉగ్రరూపం కనిపిస్తుంది. అయితే అదృష్టవశాత్తు తమను బాలకృష్ణ ఏమీ అనలేదని లేకుంటే.. ఇక అంతే అంటూ గ్రామస్థులు చర్చించుకోవడం విశేషం. ఈ పర్యటనలో బాలకృష్ణ కాస్త భిన్నంగా ప్రవర్తించారని నిమ్మకూరు ప్రజలు అంటున్నారు. వచ్చిన ప్రతి అభిమానితో బాలకృష్ణ ఫోటోలు దిగడం ఆశ్చర్యానికి గురి చేసిందని, కానీ కొమరవోలు వాసులు ఫోటోలు దిగి, అలా మాట్లాడడమే కోపానికి కారణమని వారు అంటున్నారు.
Also Read: Posani Arrest: పోసాని అందమే.. అరెస్ట్ కు కారణమా?
అయితే బాలకృష్ణ బస చేసిన నివాసం వద్ద అభిమానులు భారీగా చేరుకున్నారు. దీనితో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. తన తల్లి స్వగ్రామస్థులు వచ్చిన సమయంలో బాలకృష్ణ అలా మాట్లాడకుండ ఉండాల్సింది అంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదిఏమైనా నిమ్మకూరు టూర్ లో మాత్రం లెజెండ్ హుషారుగా అభిమానులను పలకరించడం, అలాగే ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో స్థానిక అభిమానులు మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా స్థానిక మీడియా ప్రతినిధులతో బాలయ్య మాట్లాడుతూ.. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారతరత్న వస్తుందని తెలిపారు. అలాగే అమరావతిలో క్యాన్సర్ వైద్యశాల ఏర్పాటు చేయనున్నట్లు, త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ ఆగ్రహం
నిమ్మకూరులో బాలకృష్ణతో ఫోటోలు దిగిన కొమరవోలు గ్రామస్తులు
మా గ్రామానికి కూడా రండి అంటుంటే.. పట్టించుకోను అంటూ బాలకృష్ణ అసహనం
కాగా, బాలకృష్ణ తల్లి బసవతారకం స్వగ్రామం కొమరవోలు https://t.co/VdZqOD5b1v pic.twitter.com/LOPjPweCT8
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2025