India Richest States : ప్రపంచ దేశాలన్నీ జీడీపీ వృత్తి రేటులో తిరోగమంలో ప్రయాణిస్తుంటే.. భారత్ అభివృద్ధి బాటలో దూసుకుపోతుంది. ఈ ప్రగతిలో దేశంలోని రాష్ట్రాల పాత్రను విస్మరించేందుకు వీలు లేదంటున్నారు. దేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు వివిధ రంగాల్లో ప్రత్యేక లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని.. వారి ఆదాయాలు భారీగా పెంచుకుంటున్నాయి. ఇలా రాష్ట్రాలు సాధిస్తున్న మొత్తం ఆర్థిక వృద్ధిని తెలిపే.. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్-GSDP లో టాప్ లో నిలుస్తున్నాయి. మరి వాటి ఆర్థిక బలాలను పరిగణలోకి తీసుకుంటే.. దేశంలో టాప్ 10 ధనిక రాష్ట్రాలు ఏవో మీకు తెలుసా…
1. మహారాష్ట్ర
భారత దేశ ఎకాడమీ పవర్ హౌస్ గా మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివర్ణిస్తుంటారు. ఈ రాష్ట్రం 2024-25 ఆర్థిక ఏడాదిలో దాదాపు రూ.42.67 లక్షల కోట్ల సంపదను సృష్టించే అవకాశాలున్నట్లు నివేదిక స్పష్టం చేస్తున్నాయి. మహారాష్ట్ర ఆర్థిక రంగానికి ఆ రాష్ట్ర ఇండస్ట్రీస్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. ఇందులో తయారీ, ఎంటర్టైన్మెంట్, బ్యాంకింగ్, ఐటీ సెక్టార్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందుకే దేశ, అంతర్జాతీయ ప్రధాన ఆర్థిక సంస్థలన్నీ ముంబై కేంద్రంగానే పనిచేస్తుంటాయి.. ఈ కారణంగానే ముంబైని.. దేశ ఆర్థిక రాజధానిగా పిలుస్తుంటారు.
2. తమిళనాడు
దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడు దేశ ఆర్థిక ప్రగతిలో రెండవ స్థానంలో నిలుస్తోంది. ఈ రాష్ట్రం రూ.31.5 లక్షల కోట్ల సంపద సృష్టితో ధనిక రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తుంది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్న రంగాల్లో తయారీ, టెక్స్ టైల్స్, ఆటోమొబైల్ రంగాలతో పాటు ఐటీ సెక్టర్ కీలకంగా ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే.. తమిళనాడుకు ఉన్న సుదీర్ఘ సముద్రతీరం.. ఇక్కడి నుంచి వాణిజ్యపరమైన ఎగుమతులు అధికంగా జరగడంలో కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ అంశమే తమిళనాడు ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశమంటున్నారు అధికారులు.
3. కర్ణాటక
ఆర్థిక నిపుణులు అంచనాల ప్రకారం… 2024-25 ఆర్థిక ఏడాదిలో కర్ణాటక ఎకానమీ దాదాపు రూ.28 లక్షల కోట్ల ఆర్థిక సంపదను సృష్టిస్తోంది. దీంతో.. ఈ రాష్ట్రానికి ధనికి దేశాల జాబితాలో మూడో స్థానం దక్కింది. ఈ రాష్ట్రానికి రాజధాని నగరమైన బెంగళూరు ప్రత్యేక ఆర్థిక కేంద్రం. ఇక్కడి నుంచి అనేక నేషనల్, ఇంటర్నేషనల్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక్కడ ఐటీ సెక్టార్ నుంచి అధికంగా సంపద సృష్టి జరుగుతుండగా, వీటిలో బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయంగా ఎంతో విశిష్టమైన, అత్యాధునిక సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలకు కొలువైన బెంగళూరును సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా అందుకే గుర్తింపు పొందింది.
4. గుజరాత్
ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్.. దేశ ఆర్థిక వృద్ధిరేటులో కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ కొలువైన అనేక టెక్స్ టైల్స్ పరిశ్రమలతో పాటు పెట్రో కెమికల్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు గుజరాత్ ను ధనిక రాష్ట్రాల జాబితాలోకి చేర్చాయి. ఆర్థిక నిపుణుల అంచనాల ప్రకారం ఈ రాష్ట్ర జీఎస్డీపీ రూ.27.9 లక్షల కోట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే.. విదేశీ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో గుజరాత్ ముందు వరుసలో నిలుస్తోంది. అక్కడి ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ రెగ్యులేషన్ల కారణంగా అనేక దేశాల ప్రతినిధులు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
5. ఉత్తరప్రదేశ్
దేశంలోనే అత్యధిక మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ ప్రత్యేక చరిత్ర సృష్టించింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిటైన ఉత్తరప్రదేశ్.. 2024-25లో రూ.24.99 లక్షల కోట్ల సంపదను సృష్టించే అవకాశాలున్నాయి. ఇక్కడ విస్తృతమైన మానవ వనరుల అందుబాటులో ఉన్నా కానీ.. పరిశ్రమల స్థాపనలో చాలా వెనుకబాటుకు గురైంది. ఈ కారణంగానే.. ఉత్తర ప్రదేశ్ అగ్ర ధనిక రాష్ట్రం ఎదగడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్న ఉత్తర్ ప్రదేశ్.. ఈ స్థానం చేరుకునేందుకు.. వ్యవసాయ రంగమే ప్రథానం అంటున్నారు. అంటే ఈ రాష్ట్రం ఉత్పత్తి చేస్తున్న బియ్యం, గోధుమలు, చెరకు ఉత్పత్తులు భారీ స్థాయిలో ఎగుమతి అవుతున్నాయి. అయితే ఈ అగ్రి బిజినెస్ తో పాటుగా ఇటీవల కాలంలో రాష్ట్రం అమలు చేస్తున్న ప్రత్యేక వాణిజ్య విధానాలతో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ ఇండస్ట్రీస్ భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి.
6. పశ్చిమబెంగాల్
భారత దేశ ఆర్థికాభివృద్ధి గమనంలో బెంగాల్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఈ రాష్ట్రం జీఎస్టీడీపీ రూ.18.8 లక్షల కోట్లు ఉన్నట్లు ఆర్థిన సర్వేలు చెబుతున్నాయి. ఈ రాష్ట్రం నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, అగ్రికల్చర్ విభాగాల్లో పశ్చిమ బెంగాల్ మంచి ప్రగతిని నమోదు చేస్తోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-IT ఇండస్ట్రీ అభివృద్ధి చాలా ఆశాజనకంగా ఉందని చెబుతున్నారు. మరోపక్క వ్యవసాయ రంగం నుంచి వరి, నూలు ఉత్పత్తిలో వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్ కత్తా ముందు వరుసలో నిలుస్తోంది.
7. రాజస్థాన్
ఆర్థిక ప్రగతి అంచనాల మేరకు ఈ రాష్ట్ర జీఎస్డీపీ 2024-25లో రూ.17.8 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. కాగా.. ఇంత సంపదను సృష్టించేందుకు రాజస్థాన్ ఎక్కువగా టూరిజం మైనింగ్, వ్యవసాయ రంగాలను కేంద్రంగా చేసుకుందని అంటున్నారు. ఈ మూడు రంగాల నుంచే అత్యధిక వాటా ఈ రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. అలాగే.. ఈ రంగాల నుంచే అత్యధిక సంపద సృష్టి జరుగుతోందని ఆర్థిక నివేదికలు తెలుపుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రానికున్న చారిత్రక సంపదైన.. ఈ రాష్ట్ర టూరిజంను సరికొత్త శిఖరాలకు చేరుస్తుండగా, ఈ రంగం నుంచే ఎక్కువ సంపద సృష్టి జరుగుతోంది.
8. తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రత్యేక ఆర్థిక విధానాలతో భారీగా విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. ఈ కారణంగానే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీఎస్డీపీ రూ.16.5 లక్షల కోట్లు నమోదు అవుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రపంచ స్థాయి నగరంగా ఉన్న హైదరాబాద్ వాటానే అధికం. ఇక్కడి నుంచి తయారవుతున్న ఐటీ ఉత్పత్తులు, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ ఉత్పత్తులు భారీ స్థాయిలో దేశ, విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఇవే ఇక్కడ సంపద సృష్టిలో కీలక రంగాలుగా ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ రంగం అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ టెక్ సంస్థల నుంచి మంచి పెట్టుబడుల్ని ఆకర్షిస్తుంది.
9. ఆంధ్రప్రదేశ్
ఇంకా పూర్తిస్థాయి లో కోలుకొని ఆంధ్రప్రదేశ్ సైతం మొదటి 10 ధనిక రాష్ట్రాల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలుస్తుంది. ఇక్కడ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, సంపద సృష్టిలో కీలకమైన రాజధాని నగరం లేకుండా ఉండడం వంటి కారణాలతో.. ఆంధ్రప్రదేశ్ 9వ ధనిక రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర జీఎస్డీపీ 2024-2025 ఆర్థిక ఏడాదిలో.. రూ.15.89 లక్షల కోట్లుగా ఉండనుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగంలో హార్టికల్చర్ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడిప్పుడే మ్యానుఫ్యాక్చర్ లో మంచి వృద్ధిని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
10. మధ్యప్రదేశ్
ఆర్థిక ధనిక రాష్ట్ర జాబితాలో మధ్యప్రదేశ్ 10వ స్థానంలో నిలుస్తుంది. ఇక్కడి విస్తారమైన మైనింగ్, అటవీ ఉత్పత్తులతో పాటు అగ్రికల్చర్ సెక్టార్ అధిక సంపదన సృష్టిస్తుంది. ఈ రాష్ట్రం 2024-2025లో జీఎస్డీపీలో రూ.15.22 లక్షల కోట్లుగా ఉంటుందని అంటున్నారు. ఇక్కడి అగ్రికల్చర్ సెక్టార్ ఉత్పత్తి చేసే సోయాబీన్స్, గోధుమలు, పప్పు ధాన్యాలు.. రాష్ట్ర ప్రగతికి కీలక చక్రాలుగా పనిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం పారిశ్రామిక సంఘాన్ని పరుగులు పట్టించేందుకు రాష్ట్రం అనేది చర్యలు చేపడుతోంది. దాంతో.. రాబోయే రోజుల్లో ఈ జాబితాలో రాష్ట్రం మరింత మందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు.