OTT Movie : కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు దర్శకులు. భాషతో సంబంధం లేకుండా వీటిని చూసి ఎంటర్టైన్ అవుతున్నారు మూవీ లవర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరాఠీ మూవీ జాంబీ కథతో తెరకెక్కింది. మరాఠీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటిలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో అందుబాటులో లేకపోయినా, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
జీ 5 (ZEE5) లో
ఈ మరాఠీ జాంబీ కామెడీ మూవీ పేరు ‘జోంబివిలి’ (Zombivli). 2022 లో విడుదలైన ఈ మూవీకి ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు. ఇందులో లలిత్ ప్రభాకర్, వైదేహి పరశురామి, అమే వాఘ్, తృప్తి ఖామ్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ముంబైలోని డోంబివ్లీ అనే ఏరియా లో జాంబీ ల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ జనవరి 26, 2022 లో థియేటర్లలో విడుదలై, 20 మే 2022 నుంచి జీ 5 ( ZEE 5) ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది.
స్టోరీలోకి వెళితే
విశ్వాస్ అనే ఒక చోటా నాయకుడు ముంబైలో డోంబివ్లీలోని జనతా నగర్‌లో నివసిస్తూ ఉంటాడు. ఇతనికి కాస్త టెంపర్ ఎక్కువగానే ఉంటుంది. సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండే వ్యక్తి. ఒక రోజు అతను అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కానీ అక్కడ ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న రోగులతో ఆసుపత్రి నిండి ఉంటుంది. రోగులకు ఆసుపత్రిలో ఇచ్చే మందులో పనిచేయకపోవడంతో, ఒక రోగి జాంబీలా ప్రవర్తిస్తూ ఆసుపత్రి నుండి బయటకు వెళ్ళిపోతాడు. మరోవైపు, సుధీర్ అనే ఇంజనీర్, అప్పా ముసలే అనే స్థానిక నాయకుడి బాట్లింగ్ కంపెనీలో పనిచేస్తాడు. అతను తన ప్రెగ్నెంట్ భార్య సీమా తో కలిసి జనతా నగర్ సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో కొత్తగా నివాసం ఉండటానికి వెళతాడు. వారు డోంబివ్లీలో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వచ్చినప్పటికీ, నీటి కొరత ఇబ్బంది పెడుతుంది.
అంతేకాకుండా ఆ ఏరియా పక్కనే ఉండే ఈ అపార్ట్మెంట్ కి, కొన్ని జంబీలు రావడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ జాంబీ వ్యాప్తికి కారణం ఒక కంపెనీ వల్ల కలుషితమైన నీరు అని తెలుస్తుంది. ఇది జనతా నగర్‌లోని స్లమ్ నివాసులను జాంబీలుగా మారుస్తుంది. త్వరలోనే ఈ వ్యాప్తి సమీపంలోని రెసిడెన్షియల్ ఇళ్లకు కూడా వ్యాపిస్తుంది. సుధీర్, సీమా, విశ్వాస్, కొంతమంది స్థానికులు ఈ జాంబీల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ వ్యాప్తిని అరికట్టడానికి వీళ్ళంతా కలిసి పోరాడాల్సి వస్తుంది. చివరికి ఈ జాంబీ లను వీళ్ళు ఎలా ఎదుర్కుంటారు ? ఆ జాంబీల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి. దీనికి విరుగుడు లభిస్తుందా ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ జాంబీ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : కొడుకు ముందే అలాంటి పని చేసే తల్లి … అద్దె కట్టడానికి అడ్డమైన పనులు … గుండెను పిండే ఓ సె*క్స్ వర్కర్ స్టోరీ