RGV: ఈరోజుల్లో అసలు రెమ్యునరేషన్ తీసుకోకుండా ఒక సినిమా కోసం పనిచేశామని లేదా సినిమా కోసం రెమ్యునరేషన్ త్యాగం చేశామని హీరోలు చెప్పుకోవడం చాలా కామన్ అయిపోయింది. అదంతా నిజమా, కాదా తెలియకపోయినా చాలావరకు హీరోలు తమ సినిమాల ప్రమోషన్స్ సమయంలో ఇదే స్టేట్‌మెంట్‌ను ఉపయోగించుకుంటున్నారు. కానీ కొన్నేళ్ల క్రితం నిజంగానే సినిమాల కోసం రెమ్యునరేషన్ తీసుకోకుండా పనిచేసిన హీరోలు ఉన్నారు. ఇక టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం అస్సలు రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా తెరకెక్కించాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రూపాయి రెమ్యునరేషన్
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలోనే తన సినిమాలతో ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా అప్పట్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాలను ఫామ్‌లోకి తీసుకొచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని ఇప్పటికీ ప్రేక్షకులంతా గుర్తుచేసుకుంటూ ఉంటారు. అలా తను తెరకెక్కించిన ఎన్నో గ్యాంగ్‌స్టర్ డ్రామాలు చెరపలేని రికార్డులను క్రియేట్ చేశాయి. ఇప్పటికీ ఆ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సినిమాల్లో ఒకటి ‘సత్య’. జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‌పాయ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో అండర్ వరల్డ్‌లో సైతం హాట్ టాపిక్‌గా మారింది. అలాంటి మూవీకి మనోజ్ బాజ్‌పాయ్ ఒక్క రూపాయి మాత్రమే రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని హన్సల్ మెహ్తా బయటపెట్టారు.
తక్కువ ఖర్చుతో
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫిల్మ్ మేకర్స్ హన్సల్ మెహ్తా.. ‘సత్య’ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘మనోజ్ బాయ్‌పాయ్‌కు సత్య సినిమా కోసం నేను కేవలం రూ.1 మాత్రమే ఇచ్చాను. బాగా తాగి తనకు ఆ రూపాయి ఇచ్చాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనురాగ్ కశ్యప్‌కు కేవలం అడ్వాన్స్ డబ్బులు మాత్రమే ఇచ్చానని తెలిపారు. ‘సత్య’ సినిమాను రామ్ గోపాల్ వర్మతో కలిసి రాసిన సౌరభ్ శుక్లాకు అసలు రెమ్యునరేషనే ఇవ్వలేదని బయటపెట్టాడు. ఇది విన్న తర్వాత ‘సత్య’ సినిమా మినిమమ్ బడ్జెట్‌తో, చాలావరకు రెమ్యునరేషన్ లేకుండా తెరకెక్కి కల్ట్ స్టేటస్ సాధించిందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
Also Read: తమన్నాకంటే నేనే బెటర్ అంటున్న ఊర్వశి.. ఆపై సైలెంట్‌గా పోస్ట్ డిలీట్
హిట్ కాంబినేషన్
‘సత్య’ (Satya) సినిమాలో భీకూ మాత్రే పాత్రలో నటించాడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). తన కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా, ఎన్ని పాత్రలు చేసినా ఇది మాత్రం గుర్తుండిపోయే పాత్రగా నిలిచిపోతుందని తన ఫ్యాన్స్ అంటుంటారు. 1998లో విడుదలయిన ఈ మూవీ రామ్ గోపాల్ వర్మ మాత్రమే కాదు.. అనురాగ్ కశ్యప్, సౌరభ్ శుక్లా కెరీర్లను కూడా మలుపు తిప్పింది. ‘సత్య’ తర్వాత మనోజ్ బాజ్‌పాయ్, రామ్ గోపాల్ వర్మ కలిసి మరెన్నో హిట్ సినిమాలు తెరకెక్కించారు. ‘సత్య’, ‘కౌన్’, ‘షూల్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టారు. ఇక త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో హారర్ కామెడీ తెరకెక్కబోతుందని రామ్ గోపాల్ వర్మ స్వయంగా ప్రకటించారు.