Tollywood Actress Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌లలో శ్రీలీల ఒకరు. ఈ బ్యూటీ 2017లో టాలీవుడ్‌లో చిత్రాంగద సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.
ఆ తర్వాత 2021లో హీరో శ్రీకాంత్ కుమారుడు నటించిన పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్‌గా చేసి అందరి దృష్టి ఆకర్షించింది.
రవితేజతో కలిసి నటించిన ధమకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఒక్కసారిగా ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.
టాలీవుడ్ శ్రీలీల మార్మోగిపోయింది. తాజాగా, సోషల్ మీడియాలో ఎల్లో డ్రెస్‌లో ఫోజులిస్తూ మెస్మరైజ్ చేస్తూ సందడి చేసింది.
మహేష్ బాబుతో గుంటూరు కారం, బాలకృష్ణ భగవంత్ కేసరితో ఫర్వాలేదనిపించింది.
ఇన్నాళ్లు చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉన్న శ్రీలీల.. మరోసారి తన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తుంది.