Shivraj Singh Chouhan: ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తానని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. విజయవాడ వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని అన్నారు. ప్రభుత్వం తరపున సహాయక కార్యక్రమాలు చేశారని తెలిపారు. త్వరగా కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందేలా చేస్తామని శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు.
ఏపీలోని భారీ వర్షాలు, వరదల కారణంగా కేంద్రం ఎప్పటికప్పుడు సమచారం తెప్పించుకుని సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. వరద ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏపీ వరదల పరిస్థితులపై ప్రధానికి వివరిస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ల ద్వారా సహాయం అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో లక్షా 80 వేల హెక్టార్ల పంట నష్టం జరిగిందని అన్నారు. పశు, పంట నష్టంతో పాటు వ్యాపార సంస్థలు చాలా వరకు దెబ్బతిన్నాయని అన్నారు.
Also Read: Social Media: రెచ్చగొడితే అరెస్టే..! దిలీప్ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా చర్చ
గృహ సంబంధిత ఉపకరణాలు నేలపాలయ్యాని తెలిపారు. బాధితులకు ఫసల్ బీమా యోజన క్రింద సహాయం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ కృషి వల్ల ప్రాణనష్టం తగ్గిందని అన్నారు. ఏపీలో జరిగిన నష్టాన్ని గుర్తించేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుందన్నారు. విపత్తు నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.