Alia Bhatt Latest Photos: అనంత్ అంబాని, రాధిక మర్చంట్ సంగీత్ వేడుకలో సెలబ్రెటీలు అందరూ సందడి చేశారు. మరి ఈ ఈవెంట్ లో ఆలియా భట్ ఎలా ముస్తాబ్ అయిందో మీరే చూడండి.
అనంత్ అంబాని, రాధిక మర్చంట్ వేడుక అంబరాన్నింటింది. ఈ వేడుకలో సినీతారలు వెరైటీ వెరైటీ డ్రస్సుల్లో మెరిసారు.
ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, రణ్ బీర్ కపూర్ తో పాటు షహీన్ భట్, ఆదిత్య రాయ్ కపూర్ ఇలా బ్లాక్ డ్రెస్ లలో ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో అలియా భట్ షేర్ చేసింది.
ఇక ఈ బ్యూటీ కెరీర్ పరంగా చూస్తే.. లేడీ ఓరియెంటెడ్ ప్రధాన పాత్రలో స్పై మూవీలో నటిస్తోంది. జులై 15న ముంబైలో షూటింగ్ జరగనుంది.
అలియా భట్ బాలీవుడ్ లో అలరిస్తూనే ఇటీవల ఆర్ఆర్ఆర్ మూవీలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.