Anupama Parameswaran (Image Credit: Instagram)
అందాలతార మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో.. కర్లీ జుట్టుతో కర్లీ కళ్యాణిగా పేరు దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Anupama Parameswaran (Image Credit: Instagram)
ఒకప్పుడు పద్ధతిగా పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు తన సినిమాలలోని పాత్రలలో బోల్డ్ గా ప్రదర్శన చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Anupama Parameswaran (Image Credit: Instagram)
అలాగే దెయ్యం గెటప్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది వచ్చిన కిష్కింధపురి సినిమాలో తొలిసారి డెవిల్ పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించింది.

Anupama Parameswaran (Image Credit: Instagram)
ఇక పరదా సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమా చేసి పర్వాలేదనిపించుకున్న అనుపమ పరమేశ్వరన్.. విక్రమ్ చియాన్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన బైసన్ సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.

Anupama Parameswaran (Image Credit: Instagram)
ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో చేస్తూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ వలకబోసే ప్రయత్నం చేస్తున్న ఈమె.. మరోసారి అందాలతో ఆకట్టుకుంది.

Anupama Parameswaran (Image Credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా ఎరుపు రంగు చీర ధరించిన అనుపమ తన అందాల సోయగాలతో అభిమానులను అలరించే ప్రయత్నం చేసింది. ఇక నడుము వయ్యారాలతో అభిమానులలో గిలిగింతలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.