Asia Cup 2025 jersey : భారత ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడంతో డ్రీమ్ 11 టీమిండియా కి స్పాన్సర్ షిప్ రద్దు చేసుకుంది. దీంతో కొత్తగా స్పాన్సర్ షిప్ ఎవ్వరూ వహిస్తారని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. కానీ ఎట్టకేలకు టీమిండియా న్యూ జెర్సీ రిలీజ్ చేసింది. ముఖ్యంగా డ్రీమ్ 11తో స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకోవడంతో ఎలాంటి స్పాన్సర్ లోగో లేకుండానే జెర్సీని రిలీజ్ చేశారు.ఈ టోర్నీ అనంతరం కొత్త స్పాన్సర్ రానున్నారు. ఇప్పటివరకు టీమిండియా జెర్సీ స్పాన్సర్ చేసిన దాదాపు అన్ని కంపెనీలు కూడా దివాళ తీయడంతో పాటు ఇంకేదో కేసులో ఇరుక్కోవడం వంటివి జరిగాయి. ఆసియా కప్ 2025 కి స్పాన్సర్ షిప్ లేకుండానే జెర్సీ రిలీజ్ చేయడం విశేషం. డ్రీమ్ 11 రద్దు కావడంతో చాలా నష్టాలు ఎదుర్కొవాల్సి వచ్చినట్టు సమాచారం. బీసీసీఐ కొత్త స్పాన్సర్ షిప్ కోసం ఎప్పుడూ బిడ్ వేస్తుందో అనేది తెలియదు. త్వరలోనే బిడ్ వేయనున్నట్టు తెలుస్తోంది. టీమిండియా స్పాన్సర్ షిప్ లేకుండా ఉన్న జెర్సీ చూపర్లను ఆకట్టుకుంటోంది.