Viral Video: తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే చేసే పని సాధారణంగా ఉన్నా కూడా పరిస్థితులను బట్టి అందిరినీ విస్మయానికి గురిచేస్తుంటాయి. ముఖ్యంగా ఇలాంటివి సెలబ్రిటీలు చేస్తే ఎలా ఉంటుందో కానీ సాధారణ మనుషులు చేస్తే మాత్రం అది వింతగా అనిపిస్తుంది. ఇటీవల చాలా మంది విన్యాసాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అయితే ఈ వ్యక్తి వీడియోలు చేయకున్నా కూడా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు. కేవలం తన పని తాను చేస్తూ వెళ్తుండగా చుట్టూ ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఈ ఘటన పాకిస్థాన్‌లో వెలుగు చూసింది. పాకిస్థాన్ లో ఓ వ్యక్తి చేసిన పనికి అందరూ కుళ్లుకుంటున్నారు. ఓ వ్యక్తి మంచాన్ని ట్రక్కులో పెట్టుకుని ఊయల కట్టుకున్నాడు. అంతేకాదు ఆ ఊయలలో కూర్చుని దర్జాగా కూర్చున్నాడు. ఈ వ్యక్తి చేసిన జుగాడ్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కదిలే ట్రక్కులో ఓ మంచాన్ని ఊయలలా కట్టుకుని అందులో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ప్రయాణం చేశాడు. అంతేకాదు హాయిగా పడుకుని సెల్ ఫోన్ తో ఆడుతూ ప్రయాణం చేస్తూ కనిపించాడు.
రోడ్డుపై ఓ వాహనంలో ఇలా దర్జాగా ప్రయాణించడం అంటే నిజంగా అది గొప్పే అని అందరూ పొగుడుతున్నారు. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఊయల ఊగుతూ ప్రయాణం చేయడం నిజంగా ఎక్కడ చూసి ఉండరని అంటున్నారు. అయితే ట్రక్కులో మంచం నాలుగు కాళ్లను తాళ్లతో గట్టిగా కట్టి అందులో పడుకున్నాడు. ఇలా ఓ వాహనంలో దర్జాగా పడుకుని ఈ విధంగా ప్రయాణించడం అంటే నిజంగా ఓ సాహసమే అని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
View this post on Instagram