Asia Cup 2025 : సెప్టెంబర్ 09 నుంచి యూఏఈలో ఆసియా కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది యూఏఈ ఆతిథ్యం ఇవ్వనుంది. మ్యాచ్ లు యూఏఈలోని అబుదాబి, దుబాయ్ వేదికల్లో జరుగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా జరుగనుంది. అయితే తొలి మ్యాచ్ హాంకాంగ్ వర్సెస్ అప్గానిస్తాన్ జట్ల మధ్య జరుగనుంది. భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఇక సెప్టెంబర్ 14న దాయాది పాకిస్తాన్ తో తలపడనుంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా..? లేదా అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇచ్చారు.
Also Read : Asia Cup 2025 : ఆసియా కప్ 2025 జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ముఖ్యంగా టీమిండియా ఆసియా కప్ 2025లో అన్ని మ్యాచ్ లు ఆడుతుందని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడొద్దని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ టీమిండియా-పాక్ మ్యాచ్ విషయంలో బీసీసీఐ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుందని.. ఈ విషయంలో బోర్డుకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. పాకిస్తాన్ తో మ్యాచ్ విషయంలో బీసీసీఐ వైఖరీ చాలా స్పష్టంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని.. భారత ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. ఆ విధానాన్ని అనుసరించడంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సోషల్ మీడియాలో మాత్రం బీసీసీఐ పై రకరకాలుగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఆడలేదు.. కానీ ఆసియా కప్ లో ఎందుకు ఆడుతున్నారని నెత్తురు మరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా కప్ లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా తొలిసారిగా పాకిస్తాన్ తో తలపడనుంది. ఇప్పటివరకు వీరు ఆటగాళ్లుగా మాత్రమే ఆడారు. కానీ కొత్త కెప్టెన్, వైస్ కెప్టెన్లు. టీ-20 ఆసియా కప్ కి కొత్త కెప్టెన్ ఏవిధంగా దాయాది జట్టు కు సమాధానం చెబుతాడో అని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండటం విశేషం. మరోవైపు ఆసియా కప్ 2025 యూఏఈలో జరుగుతుండటంతో అక్కడ ఎండలు ఎక్కువగా ఉండటం.. ఉక్కపోత కారణంగా మ్యాచ్ ను అరగంట ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. అంటే వాస్తవానికి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఆసియా కప్ లో భారత పేసర్ అర్ష్ దీప్ సింగ్ కేవలం ఒక్క వికెట్ తీస్తే.. టీ-20 ఫార్మాట్ లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నాడు. కేవలం 17 పరుగులు చేస్తే.. తన పేరును చరిత్రలో లిఖించుకోనున్నాడు. ఆసియా కప్ 2025 కోసం ఇప్పటికే టీమిండియా జట్టు దుబాయ్ కి చేరుకొని అక్కడ ప్రాక్టీస్ ని ప్రారంభించింది.