Hyderabad Water: హైదరాబాద్ ప్రజలకు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 10వ తేదీ ఉదయం 11 గంటల వరకు మొత్తం 48 గంటల పాటు అనేక ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపి వేయనున్నట్లు ప్రకటించింది. ఇదంతా గోదావరి తాగునీటి సరఫరా దశ–1 ప్రాజెక్టులో వాల్వ్‌లను భర్తీ చేయడం కోసం చేపట్టే పనుల కారణంగానే జరుగుతోందని వివరించింది. ముర్మూర్, మల్లారం, కొండపాక పంపింగ్ స్టేషన్లలో 3000 మీమీ వెడల్పు ఉన్న ప్రధాన పైప్‌లైన్‌లో 900మీమీ వ్యాసం కలిగిన వాల్వ్‌లను మార్చాల్సి రావడంతో ఈ పనులు షెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరంలో అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ముందుగానే నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు, పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేసింది
వాటర్ బంద్ చేస్తున్న ఏరియాలివే..
ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, సోమాజిగూడ, జూబ్లీహిల్స్ భాగాలు, తాటికాన, లాలాపేట్, తార్నాక ప్రాంతాలు నీరు బంద్ చేయనున్నారు.
ఇక కూకట్‌పల్లి, వివేకానంద నగర్, ఎల్లమ్మబండ, మూసాపేట్, భరత్‌నగర్, మోతీనగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హష్మత్‌పేట్ ప్రాంతాలు కూడా నీటి సరఫరాకు అంతరాయం ఎదుర్కోనున్నాయి. చింతల్, సుచిత్ర, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, జగద్గిరిగుట్ట, ఉషోదయ ప్రాంతాలు.
Also Read:Phone Charging: ఫోన్ చార్జింగ్ అయిపోయిన తరువాత.. చార్జర్ అలాగే వదిలేస్తున్నారా?
అలాగే అల్వాల్, మాచబోలారం, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్ నగర్, మౌలాలి రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాలు కూడా ప్రభావితమవుతాయి. చర్లపల్లి, సాయిబాబా నగర్, రాధిక, కైలాస్గిరి పాత–కొత్త రిజర్వాయర్ పరిధి, మల్లాపూర్ నీటి సరఫరా బంద్ కానున్నాయి. అలాగే కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, నల్లగండ్ల, హఫీజ్‌పేట, మియాపూర్ ప్రాంతాలు కూడా ఇదే నిబంధనలు ఉంటాయి.
మరోవైపు కొంపల్లి, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, అయ్యప్ప కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, తెల్లాపూర్, బొల్లారం, బౌరంపేట, ఎమ్ఈఎస్, త్రిశూల్ లైన్స్, హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇక అలెన్, ఘన్‌పూర్ వంటి గ్రామీణ ప్రాంతాల్లోని నీటి సరఫరా లిఫ్ట్ స్కీమ్‌లు కూడా ఈ అంతరాయం వల్ల ఆగిపోతాయని తెలిపింది.
మొత్తంగా 48 గంటల పాటు హైదరాబాద్‌లోని పైన తెలిపిన ప్రాంతాలకు నీటి సరఫరా ఉండదని ప్రకటించింది. ప్రతి ఇంటి వారు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. యధవిధిగా మళ్ళీ నీరు మధ్యాహ్నం 12గంటల నుంచి వదిలేందుకు పనులు సిద్దం చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు సహకరించాలని పేర్కొన్నారు.