Urvashi Rautela: బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా.. ఈ అమ్మడు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

నటన కంటే గ్లామర్‌తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది.

ఈ అందాల భామ బాలీవుడ్‌లో సన్ని దేవోల్ హీరోగా నటించిన ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ సినిమా హీరోయిన్‌గా పరిచయం అయింది.

ఆ తర్వాత పలు సినిమాలు చేసింది. అయినా పెద్దగా గుర్తింపు రాలేదు.

ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలలో ఐటెం సాంగ్‌లతో దుమ్ము దులిపేస్తుంది. ఇక్కడ కూడా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది.

తెలుగులో చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరి చూపు తనవైపుకు తిప్పుకుంది.

ఇందులో బాస్ పార్టీ సాంగ్‌లో తన అందం, డ్యాన్స్‌తో అదరగొట్టేసింది.

ఆ తర్వాత ఆమెకు తెలుగులో పలు సినిమాలలో ఐటెం సాంగ్‌లో చేసే అవకాశం లభించింది.

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలయ్య బాబు నటిస్తున్న ‘ఎన్‌బికే 109’ మూవీలో ప్రత్యేక పాత్రలో నటిస్తుంది.