Krithi Shetty: టాలీవుడ్‌లో బేబమ్మగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ కృతిశెట్టి. ఈ ఏడాది ఇయర్ ఛార్జ్ ఫుల్ చేసుకున్న ఈ సుందరి, పనిలోపనిగా వచ్చే ఏడాదిలో బిజీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఐదేళ్ల కిందట గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చిన కన్నడ బ్యూటీ.. వెనుదిరిగి చూసుకోలేదు. ఉప్పెన మూవీతో తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. వీటి తర్వాత మూడు ప్రాజెక్టులు చేసినా బాక్సాఫీసును ఆకట్టుకోలేకపోయింది.
ఈ క్రమంలో కోలీవుడ్ వైపు కన్నేసింది. తమిళంలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికి సంబందించి షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి.
కనీసం రెండు హిట్టయినా.. తన కెరీర్కు ఢోకా ఉండదని భావిస్తోంది. మలయాలం, హిందీలో ఒక్కో మూవీ చేసింది. కాకపోతే అక్కడ సరైన గుర్తింపు రాలేదు.
అన్నట్లు బేబమ్మకు ప్రస్తుతం రెండుపదుల వయస్సు మాత్రమే. మరో దశాబ్దంపాటు ఈమెకు తిరుగులేదని అంటున్నారు. లైఫ్‌లో ఇలాంటి ఒడిదుడుకులు సహజమేనని అంటున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఫాలోవర్స్‌ని పెంచుకునే పనిలో పడింది.
యాడ్స్, ఫోటోషూట్స్ తనకు సంబంధించిన అంశాలపై అభిమానులతో షేర్ చేసుకోవడం మొదలైంది. గ్లామర్ ఇండస్ట్రీ నాడిని పట్టేసిందని కొందరు అంటున్నారు.