Saripodhaa Sanivaaram photos: నేచురల్ హీరో నాని-ప్రియాంక మోహన్ కాంబోలో వచ్చిన యాక్షన్ డ్రామా మూవీ సరిపోదా శనివారం.

శుక్రవారం విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో నాలుగైదు రోజులు పడుతుందని లెక్కలు వేస్తున్నారు.

తొలిరోజు బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు బాగున్నా, రెండో రోజు వర్షంకావడంతో కొద్దిగా తగ్గినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట.

ఈ సినిమా సెట్స్‌కి సంబంధించిన ఫోటోలను హీరోయిన్ ప్రియాంక మోహన్ విడుదల చేసింది.

ఈ ప్రాజెక్టులో పని చేయడం మరపురాని గుర్తని తెలిపింది. లోతైన ప్రయాణం సాగిందని చెప్పుకొచ్చింది.

షూటింగ్ తొలి నుంచి ఎండింగ్ వరకు ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చిందని మనసులోని మాట బయటపెట్టింది.

అంకితభావంతో పనిచేసే సిబ్బందితో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవమని చెప్పుకొచ్చింది.

ఎస్‌జే సూర్య, సాయికుమార్, మురళిశర్మ, అజయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి 41 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

నాలుగైదు రోజులు కలెక్షన్లు పెరిగితే నానికి మరో హిట్ పడినట్టేనని అంటున్నాయి చిత్ర పరిశ్రమ వర్గాలు.
