E-Paper
Advertisement

తెలంగాణ‌ని త‌ట్టిలేపిన‌.. ఓ నాగేశ్వ‌ర్‌.. ఓ బ‌క్క‌ని న‌ర్సింహులు! కొత్త పంచాయితీల‌తో సర్కార్‌కు కొత్త త‌లనొప్పులు!

తెలంగాణ‌ని త‌ట్టిలేపిన‌.. ఓ నాగేశ్వ‌ర్‌.. ఓ బ‌క్క‌ని న‌ర్సింహులు! కొత్త పంచాయితీల‌తో సర్కార్‌కు కొత్త త‌లనొప్పులు!
Advertisement

ఎవ‌రి ప‌ని వాళ్లు ప్ర‌శాంతంగా చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభేదాలు కూడా స‌మిసిపోయాయి. చిన్న చిన్న విభ‌జ‌న స‌మ‌స్య‌లు త‌ప్ప‌. తెలంగాణ సెంటిమెంట్ కూడా బీఆరెస్ వాడుకోవ‌డం బంద్ చేసింది. ఇక ప్ర‌జ‌లు డెవ‌ల‌ప్‌మెంట్ కోరుకుంటున్నారు.. ఇచ్చిన హామీల కోసం చూస్తున్నార‌ని అర్థ‌మైంది. ఇంత‌కాలానికి మళ్లీ తెలంగాణ రెండు అంశాలు త‌ట్టిలేపాయి. ఒక‌దాని త‌రువాత మ‌రొక‌టి. ఒక‌దానికి మ‌రొక‌టి సంబంధం లేదు. ఒక‌టి స‌మిసిపోతుంటే… ఉసిగొల్పి నిద్ర‌లేపుతుండ‌గా.. ఆలోపే ఇంకొక‌టి అగ్నికి ఆజ్య‌మై వ‌చ్చింది.

ఇప్పుడు ఈ రెండు తెలంగాణ స‌ర్కార్‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెట్టాయి. మీరు మీరు కొట్లాడుకుని మ‌ధ్య‌లో న‌న్ను లాగ‌డ‌మెందుకు? అన్న‌ట్టు.. చెప్పుకుందాం ఇప్పుడు దీని గురించే. ఏపీలో నాగేశ్వ‌ర్ లొల్లి మెల్ల‌గా తెలంగాణ‌ను తాకింది. దీనికి ఆద్యుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. గాలికి పోయే కంప‌ను ముడ్డికి త‌గిలించుకున్నాడు. కేసులు పెట్టారు. అరెస్టుల‌న్నారు. అస‌లు నీకేం ప‌ని ఆంధ్ర‌తో.. అనే కాడికి తెచ్చారు. దీంతో తెలంగాణ లీడ‌ర్లు దీన్నిఓన్ చేసుకున్నారు. ఇవాళ కొంత మంది ప్ర‌జా సంఘాల నాయ‌కులు దీనిపై రౌండ్ టేబుల్ స‌మావేశం పెట్టి తుక్కు తుక్కు తిట్టారు ప‌వ‌న్‌ను. ఇది చ‌ల్ల‌బ‌డుతున్న వేళ ప్రాంతీయ‌త‌ను జోడించి పెంచి పెద్ద చేస్తున్న త‌రుణంలో.. టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు బ‌క్క‌ని న‌ర్సింహులు రూపంలో మ‌రో ఉప‌ద్ర‌వం వ‌చ్చి ప‌డింది.

Advertisement

ఆయ‌న‌కేం పోగాలమొచ్చిందో ఏమో..! చంద్ర‌బాబు చేత షెబ్బాష్ అనిపించుకుందామ‌నే పాడురోగ‌మో మ‌రోటో తెలియ‌దు కానీ.. మైండ్ చెడిన మాటొక‌టి మాట్లాడాడు. అస‌లు చ‌రిత్ర‌లో తెలంగాణ అనే ప‌దం లేద‌ని…దీన్ని కొంత మంది లీడ‌ర్లు త‌మ స్వార్థ రాజ‌కీయం కోసం సృష్టించి.. చాలా మంది నేత‌ల‌ను ప‌నికిరాని వారిని చేశార‌ని, వారి ఆశ‌ల‌ను అడియాశ‌లు చేశార‌ని ఏదేదో వాగాడు. వైర‌ల్ అయ్యాడు. వీడెవ‌డ్రా బాబు..! ఏడ‌పుట్టిండు..? ఏడ పెరిగిండు..! పుసుక్కున ఇంత మాట‌న్నాడు.. అని బ‌స్సున లేచారు అంతా. పార్టీల‌క‌తీతంగా.

తెలంగాణ అనే ప‌దం ఎక్క‌డ్నుంచి వ‌చ్చిందో చరిత్ర ఆన‌వాళ్లను కూడా మరోసారి వ‌ళ్లెవేసే దాకా పోయిందీ ప‌రిస్థితి. ఎంత‌టి అవ‌మానం..వీడికి బుద్ది చెప్పాలి.. అంటూ తిట్ల‌దండంకం అందుకున్నారు సోష‌ల్ మీడియాలో. మ‌రీ ఓ చరిత్ర క‌లిగిన పార్టీనాయే.. ఎవ‌రూ దొర‌క‌డం లేదు క‌రెక్టే అనుకో.. కానీ ఇలా మైండ్ చెడిన వారిని తీసుకొచ్చి రాష్ట్ర అధ్య‌క్ష ప‌ద‌వి ఇస్తే.. ఉన్న ఇజ్జ‌త్ పాయె క‌దా చంద్ర‌బాబు..!అని మ‌ధ్య‌లో ఆయ‌న‌ను కూడా అర్సుకున్న‌ర‌నుకో. ఇక మ‌రి ఈ ఇష్యూల‌తో తెలంగాణ స‌ర్కార్‌కు వ‌చ్చిన ఇబ్బందేంద‌నే క‌దా.. మీ డౌట‌నుమానం! అక్క‌డికే వ‌స్తున్నా!

Advertisement

నాగేశ్వ‌ర్ విష‌యంలో అరెస్టు చేయ‌డానికి వ‌స్తే.. తెలంగాణ స‌ర్కార్‌.. ఏపీ స‌ర్కార్‌కు స‌హకరించింద‌నే ప్ర‌చారం ఒక‌టి చేసి బ‌ద్నాం చేసే ప్రయ‌త్న చేశారు. ఇది స‌ద్దుమ‌ణిగిందో లేదో.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఒక‌టి పెద్ద‌గా ఏర్పాటు చేయ‌బోతున్న విష‌యాన్ని కూడా తెర‌పైకి తెచ్చారు. ఓవైపు టీడీపీ తెలంగాణ‌ను ఇంత‌లా అవ‌మానిస్తుంటే.. ఆ పార్టీ నాయ‌కుడి విగ్ర‌హం మ‌న‌కెందుకు? అని కొంద‌రు.. ఆయ‌న గురువు చంద్ర‌బాబుకు గురుద‌క్షిణ‌గా ఏర్పాటు చేస్తున్నాడేమోన‌ని ఇంకొంద‌రు… ఇలా దారిన పోయే వాటిని తెలంగాణకు త‌గిలించి మాట్లాడుతున్నారు.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×