E-Paper
Advertisement

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?
Advertisement

బీజేపీ, బీఆరెస్ పొత్తు విష‌యంలో… మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు కేటీఆర్. ఇవాళ ప్రెస్‌క్ల‌బ్‌లో జ‌రిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయ‌న దీనిపై త‌న‌దైన శైలిలో సెటైరిక‌ల్‌గా స్పందించాడు. ఓ విలేక‌రి అడిగాడు. త‌మ‌కున్న సోర్స్ మేర‌కు .. బీజేపీ, బీఆరెస్ పొత్తు పొట్టుకోబోతున్నాయ‌ని, జాతీయ రాజ‌కీయాల్లోకి కేటీఆర్‌ను తీసుకెళ్లాల‌ని మోడీ ఆరాట ప‌డుతున్నాడ‌ని తెలిసింద‌న్నారు. అంతే కాదు కేటీఆర్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇచ్చి.. ఐటీ శాఖ‌లో ఆయ‌న‌కున్న అనుభ‌వాన్ని దేశ వ్యాప్తంగా వినియోగించుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్నార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు.. కేటీఆర్ ఒకింత ఆశ్చ‌ర్య‌పోయాడు.

త‌న‌కు సీఎం కావాల‌ని క‌దా ఉంది ఎప్ప‌ట్నుంచో. అది కేసీఆర్ ఆలోచ‌న కూడా. అందుకోస‌మే ఆయ‌న ఎదురు చూస్తున్నాడు. స‌రే, బీజేపీతో పొత్తు అనేది ఇంకా స‌మ‌యం ఉంది.. ఇది ఇంకా ప్ర‌చారంలో ఉంది. కానీ ఏకంగా త‌నను ఢిల్లీకి పంపే ఆలోచ‌న నిజంగా చేస్తున్నారా? లేక మీడియానే త‌న‌ను కావాల‌ని ఇక్క‌డ్నుంచి సాగనంపాల‌ని చూస్తున్నారా? అనే రీతిలో ఆయ‌న ముఖం పెట్టి.. స్పందించాడు.ఇదొట్టి ఊహాజ‌నిత‌మైన‌దేన‌ని. ఈ క‌ల్పిత క‌థ‌ను సినిమాగా తీస్తే.. బాహుబ‌లి క‌న్నా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌వుతుంద‌న్నాడు వ్యంగ్యంగా. త‌ను కేంద్ర మంత్రి కావ‌డమేమిటీ? నేను ఇక్క‌డే ఉంటాను.. తెలంగాణ వ‌దిలి వెళ్ల‌ను..! అని స్ప‌ష్టం చేశాడు కేటీఆర్ న‌వ్వుతూ.

Advertisement

అంటే ఒక‌వేళ పొత్తు కుదిరినా.. ఇక్క‌డ కేసీఆర్ సీఎంగా ఉన్నా.. త‌న‌ను ఢిల్లీకి తీసుకెళ్లి.. కేంద్ర మంత్రిని చేస్తాన‌న్నా కాదంటాన‌ని కేటీఆర్ ప‌రోక్షంగా త‌న అభిప్రాయం చెప్పాడ‌ని అనుకోవాలా? లేదంటే.. పొత్తు అనేది ఉత్త క‌ల్పిత క‌థ‌నే.. అది కుదురే ప‌ని కాదు.. అయ్యే ప‌నీ కాదు.. !అని కొట్టిపారేసిన‌ట్టు అనుకోవాలా? ఇత‌మిత్థంగా ఏదీ క‌రెక్టుగా చెప్పుకుండా.. ఇది క‌ల్పిత‌మ‌న్నాడు. త‌ను తెలంగాణ‌లోనే ఉంటాన‌న్నాడు. గ‌తంలో మోడీనే ఏకంగా ఓ బ‌హిరంగ స‌భలో కేసీఆర్ త‌న‌తో కేటీఆర్‌ను సీఎం చేయాల‌నే ఆలోచ‌న‌ను పంచుకున్న విష‌యాన్ని వెల్ల‌డించాడు. త‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించ‌న‌ని ముఖం మీదే చెప్పాన‌ని కూడా అన్నాడు పీఎం.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రేవంత్‌ను ఎదుర్కోవాలంటే.. చంద్ర‌బాబులా బీజేపీతో క‌లిసి వెళ్ల‌డ‌మే క‌రెక్ట‌ని కేసీఆర్ భావిస్తున్నాడా? ఒక‌వేళ బీజేపీతో పొత్తుకు పోయినా.. ఇక్క‌డ కేటీఆర్‌ను సీఎం చేసే విష‌యంలో మోడీ ఒప్పుకుంటాడా? అందుకే మ‌ధ్యేమార్గంగా కేటీఆర్‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇచ్చి జాతీయ రాజ‌కీయాల్లోకి తీసుకుపోవాల‌నే ప్ర‌తిపాద‌న ఏమైనా వ‌చ్చిందా? ఇప్పుడు ఇవ‌న్నీ చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి ఇక్క‌డ కేటీఆర్ సీఎం.. అంటే జ‌న‌మెవ‌రూ ఆమోదించే ప‌రిస్థితిలో లేరు. అందుకే అంతా కేసీఆర్ సీఎం.. అనే నినాద‌మే తీసుకుపోతున్నారు.

Advertisement

ముందైతే అధికారంలోకి రానీయండి.. ఆ త‌రువాత తాము అనుకున్న‌ట్టు చేయొచ్చ‌నేది తండ్రీకొడుకుల ఆలోచ‌నగా ఉన్న‌ట్టుంది. కానీ సింగిల్‌గా ఎన్నిక‌ల‌కు పోతే.. అధికారం ద‌క్కుతుందా? ముందే పొత్తుల‌కు పోవాలా? ఫ‌లితాల‌ను బ‌ట్టి బీజేపీతో జ‌త క‌ట్టాలా? అనే చ‌ర్చ కూడా బీఆరెస్ వ‌ర్గాల్లో న‌డుస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంటే సింగిల్‌గా పోటీ చేసి అధికారంలోకి వ‌స్తే.. కేటీఆర్‌ను సీఎం చేయ‌డం పెద్ద స‌మ‌స్యేం కాదు కేసీఆర్‌కు. కానీ.. బీజేపీ సాయం తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రైతే.. కేటీఆర్‌ను జాతీయ రాజ‌కీయాల‌కు ప‌రిమితం చేయాల్సిందేనా? ఈ చ‌ర్చ కూడా స్టార్ట‌య్యింది. అయితే సీఎం.. లేక‌పోతే.. కేంద్ర మంత్రి ప‌ద‌వి! చూద్దాం.. భ‌విష్య‌త్తు రాజ‌కీయాలు ఎలా ఉండ‌బోతున్నాయో..! అని ఇప్ప‌ట్నుంచే గులాబీ శ్రేణులు కేటీఆర్ గురించి చ‌ర్చించుకుంటున్నారు.

Related News

వారసత్వం కొనసాగిస్తున్న రాధా! నిలకడలేని రాజకీయమే రాధకు మైనస్‌.. తండ్రి నేపథ్యం, సామాజికవర్గమే కొండంత బలం…!

రహస్య మిత్రుల మధ్య గ్యాప్‌ పెంచిన బాబు! ఎస్‌ఐఆర్‌పై జగన్‌ నిరసన గళం.. సీఈసీ నియామకం సరికాదని పశ్చాత్తాపం…

బతుకమ్మ కుంటకు జీవం పోసిన సీఎం.. సిటీ జనం చిరస్థాయిగా రేవంత్‌ను గుర్తు పెట్టుకునేలా! ఆంక్షలు చేధించుకుని మరీ ఈసారి ఘనంగా సద్దుల బతుకమ్మ!

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

Big Stories

Advertisement
×