E-Paper
Advertisement

Advertisement

కేసీఆర్ త‌నుకు తానే సెల్ప్‌గోల్ అవుతున్నాడా? రేవంత్ రెడ్డి ఎంత రెచ్చ‌గొట్టినా… ఆయ‌న నోటి వెంట ఒక్క ప‌లుకు కూడా రావ‌డం లేదు. ఫామ్‌హౌజ్‌ను వీడి వ‌చ్చే ప‌రిస్థితే లేద‌ని భీష్మించుకుని కూర్చుకున్నాడు. స‌హ‌జంగానే కేసీఆర్‌కున్న నైజం .. జ‌నంపై అలగ‌డం, ఉద్యమ స‌మ‌యం నుంచి కూడా ఆయ‌న‌ది అదే పంథా. ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న వ్యూహాలు అమ‌లు కాన‌ప్పుడు, జ‌నం ఆమోదం దొరికిన‌ప్పుడు వారిపై అలిగేవాడు.

ఫ‌లితాల త‌రువాత అజ్ఞాత‌వాసిగా మారేవాడు. ఎవ‌రినీ ప‌ట్టించుకునే వాడు కాడు. ఎవ‌రికీ అపాయింట్‌మెంట్ ఇచ్చేవాడు కాదు. అది కూడా ఓ వ్యూహ‌మేన‌ని చెప్పుకునే వారు గులాబీదండు. కానీ అది దొర‌త‌నంలో ఓ భాగంగానే చూసేవారు జ‌నం. ఏమైనా అంటే మేధో మ‌థ‌నం పేరు చెప్పుకుని స‌ర్ధిచెప్పుకునేవారు. కేసీఆర్ చేష్ట‌ల‌ను స‌మ‌ర్థించేవారు తోటి గులాబీ దండు.

Advertisement

అయితే అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా ఆయ‌నేం మార‌లేదు. ప‌దేళ్లు అధికారం అనుభ‌వించి కూడా జ‌నం ఓడ‌గొట్ట‌గానే అది జ‌నం త‌ప్పిద‌మే అన్న‌ట్టుగా.. ఇంత మంచి పాల‌న అందించి తెలంగాణ‌కు జాతిపిత‌గా కీర్తి గ‌డించిన త‌న‌ను సొంత స్టేట్‌లో ఓటమిని జీర్ణించుకోలేక‌పోయాడు. దేశ్ కీ నేతగా కీర్తి గడిచేందుకు భారీ వ్యూహ ర‌చ‌న చేసి తెలంగాణ సొమ్మును భారీగా వ‌ర‌ద పారించేందుకు కూడా సిద్ద‌మైతే.. ఇంట‌నే గెల‌వ‌లేదు. ఇక ర‌చ్చ గెలిచే చాన్సే లేకుండా చేశారు. ఎవ‌రు? తెలంగాణ జ‌నం.

అందుకే ఆ జ‌నం పై విప‌రీతమైన కోపం కేసీఆర్‌కు. అందుకే ఫామ్‌హౌజ్‌కు ప‌రిమిత‌మ్యాడు. అసెంబ్లీకి రాక‌పోవ‌డానికీ కార‌ణం ఉంది.. రేవంత్‌ను రాజ‌కీయంగా ఓ బ‌చ్చాగా చూస్తున్నాడు. అత‌న్ని త‌న స‌మఉజ్జీగా కాదు క‌దా క‌నీసం ఓ లీడ‌ర్‌గా కూడా చూడ‌టం లేదు కేసీఆర్. దీనికి తోడు రేవంత్ నోటి భ‌యం కూడా ఉండ‌నే ఉంది. స‌బ్జెక్టు వైజ్‌గా కాకుండా రేవంత్ ప‌ర్స‌న‌ల్ దాడికి దిగుతాడు.

Advertisement

నైతికంగా దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఆ మాట‌ల‌కు తిరిగి కౌంట‌ర్ ఇవ్వాల‌న్నా బీఆరెస్ నేత‌ల‌కు టైమ్ ప‌డుతుంది. ఆలోపు పుణ్య‌కాలం కాస్తా గ‌డిచిపోతుంది. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఇన్నిన్ని మాట‌ల‌న్నా.. క‌నీసం ఆయన స్పందించ‌డం లేదు. స్పందిస్తే రేవంత్ వ్యూహంలో త‌ను చిక్కుకున్న‌ట్టేన‌ని ఆయ‌న భావిస్తున్నాడు. అందుకే పీక‌ల్లోతు కోప‌మున్నా .. దాన్ని అణుచుకుంటున్నాడు త‌ప్ప‌.. బ‌య‌ట ప‌డ‌టం లేదు.

ఇలా మౌనం వ‌హించ‌డం వ‌ల్ల సానుభూతి దొరుకుతుంద‌నేది కేసీఆర్ వ్యూహంగా ఉంది. అంతే కాదు. త‌ను.. చిన్న చిన్న విషయాలు ప‌ట్టించుకోన‌ని, ప్ర‌జ‌ల‌కు దూరంగా ఉన్నా ఫామ్‌హౌజ్‌లో కూర్చుని మేధో మ‌థనం చేస్తున్నాన‌ని చెప్పుకోవ‌డం ఆయ‌న వ్యూహం. కానీ కాంగ్రెస్ దెబ్బ‌కు అక్క‌డ జ‌రుగుతున్న‌ది మేధో మ‌థ‌నం కాదు.. అంత‌ర్మ‌థ‌నం.బ‌య‌ట‌కు రాలేక‌.. లోప‌ల ప్ర‌శాంతంగా ఉండ‌లేక. కొడుకుపై న‌మ్మ‌కం లేక‌.. పూర్తి బాధ్య‌త‌లు ఇచ్చి ఎప్పుడేం జ‌రుగుతుందో.. పార్టీకి మ‌రింతగా న‌ష్ట‌పోయే అంశాలు ఏ దిక్కున వ‌చ్చి నెత్తిన ప‌డ‌తాయోన‌నే బుగులు అయ‌న్ను వెంటాడుతోంది.

అందుకే ఆయన అంతే మార‌డు. రేసుగుర్రం సినిమాలో.. హీరోయిన్ శృతి హ‌స‌న్, త‌న‌కు నిజ‌జీవితంలో తార‌ప‌డే ప‌త్రీ భ‌యం గొలిపే ప‌నికి లోలోన విప‌రీతంగా భ‌య‌ప‌డుతూ ఉంటుంది. కానీ బ‌య‌ట‌కు మాత్రం న‌వ్వుతూ క‌నిపిస్తూ ఉంటుంది. సేమ్‌, ఇప్ప‌డు కేసీఆర్ కూడా అంతే.

Related News

ఇద్ద‌రు చెరోదిక్కు దోచుకున్నారు.. మ‌ళ్లీ దోచుకునేందుకు అధికారం కోసం చూస్తున్నారు..!

అస‌మ్మ‌తి అధిష్టానంపై… అసంతృప్తి మీడియాపై! మీడియాను టార్గెట్ చేస్తే ప‌లుచ‌న‌య్యేది లీడ‌ర్లే..

రాజీనామాకు కొండా నో…! మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణే ప‌రిష్కార‌మా? మంత్రి ప‌ద‌విపై అంచ‌నాలు, లెక్క‌ల్లో ఆశావ‌హులు..

ఉత్కంఠ! అధిష్టానం నిర్ణయం ఫైనల్! వెంటనే స్పందిస్తే బెటర్ అంటున్న రేవంత్ టీం!

విజ‌య సాయిరెడ్డి ఎవ‌రు విడిచిన బాణం.. ఎవ‌రి పై గురి? బాబుకు క‌లిసొస్తున్న‌ మిత్ర‌బేధం?

తెలంగాణతో మోడీ తీరు ఇదే!? సీఎం కలుపుకుపోదామనుకున్నా.. రాజకీయాలకే బీజేపీ ప్రాధాన్యం!

ఆమె అంటే ఎందుకంత జంకు… గజ్జు మంటున్న ప్ర‌భుత్వ‌ పెద్దలు.. ఆచితూచి వ్య‌వ‌హారం అందుకే!

కొండాకు మ‌రో క్ష‌మాభిక్ష‌..? ఖర్గేతో రాయ‌బారం ఫ‌లించిన‌ట్టేనా..? సీఎం వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మం ఇదేనా?

Big Stories

Advertisement
×