E-Paper
Advertisement

కుప్ప‌లు తెప్ప‌ల హామీలు.. అప్పుల తిప్ప‌ల పాల‌కులు! త‌మిళ‌, తెలుగు రాష్ట్రాల పోలిక‌లు..!

కుప్ప‌లు తెప్ప‌ల హామీలు.. అప్పుల తిప్ప‌ల పాల‌కులు! త‌మిళ‌, తెలుగు రాష్ట్రాల పోలిక‌లు..!
Advertisement

త‌మిళ‌నాడు, తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాలు చాలా విష‌యాల్లో పోలిక‌లు స‌రిపోతున్నాయి. తమిళ‌నాట జ‌రిగిన ప్ర‌భుత్వ ఏర్పాటుపై జ‌రిగిన ట్విస్టుల మీద ట్విస్టుల‌ను తెలుగు ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అక్క‌డ విజ‌య్ అనూహ్యంగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గెలిస్తే.. ఏపీలో ప‌వ‌న్ ఎందుకు అలా రాలేక‌పోయాడు.. ఇక్క‌డ మనోడికి అంత సీన్ లేదు..!అనే విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. వాస్త‌వానికి విజ‌య్, ప‌వ‌న్‌కు తేడా ఉంది. తొలిసారిగా అన్ని సీట్ల‌లో పోటీ చేసిన ప‌వ‌న్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు జ‌నం. అప్పుడు చిరంజీవి పార్టీ కి కూడా జ‌నం తండోప‌తండాలుగా వ‌చ్చారు. కానీ 18 శాతం మాత్ర‌మే ఓట్లు సాధించ‌గ‌లిగాడు. కింగ్ కాదు కదా కింగ్ మేక‌ర్ కూడా కాలేక‌పోయాడు.

చిరంజీవి ఫెయిల్యూర్ కూడా ప‌వ‌న్‌ను వెంటాడిన‌ట్టుంది. అందుకే రాజ‌కీయాల్లో త‌న స్టామినా ఏంటో తెలుసుకున్న ప‌వ‌న్‌.. రెండో సారి ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మలుచుకుని చంద్ర‌బాబు స‌పోర్టుతో లిమిటెడ్ సీట్లు ఎంపిక చేసుకుని అన్నింటా గెలిచి.. కీల‌క‌మైన డిప్యూటీ సీఎం ప‌ద‌విని ద‌క్కించుకోగ‌లిగాడు. ఇక ఇప్పుడు అప్పులు లొల్లి సేమ్ టు సేమ్ అక్క‌డిలాగే అక్క‌డా మొద‌లైంది. ఇక్క‌డ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, కొత్త హామీలను కొన‌సాగించే విష‌యంలో అప్పులే ఆటంకంగా మారాయి.

Advertisement

సీఎంగా రేవంత్ రెడ్డి .. కేసీఆర్ చేసిన 8 ల‌క్ష‌ల కోట్ల అప్పుల గురించి ప్ర‌స్తావిస్తే.. అక్క‌డ విజ‌య్ .. స్టాలిన్ స‌ర్కార్ చేసిన 10 ల‌క్ష‌ల కోట్ల అప్పుల గురించి ఆదిలోనే బ‌య‌ట‌పెట్టాడు. చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా ఏపీలో అంతే. కానీ ఏన్డీయేలో టీడీపీ భాగ‌స్వామ్య‌మైనందున కొంత ప‌ర్వాలేదు. కొన్ని స్కీమ్స్ అమ‌లు చేయ‌డంతో పాటు.. అమ‌రావ‌తిని రాజ‌ధానికి ప్ర‌క‌టింప‌జేసుకుని డెవ‌ల‌ప్‌మెంట్ దిశ‌గా ఏపీని దూసుకెళ్లేలా చేస్తున్నాడు చంద్ర‌బాబు. అయితే విజ‌య్‌ చేసిన కామెంట్స్‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స్టాలిన్ కూడా విజ‌య్‌కు అప్పుల విష‌యంలో బ‌హిరంగ లేఖ రాశాడు. చాలా హుందాగా ఉంది అది. నేను అన్ని అప్పులు చేయ‌లేదని ఆయ‌నెక్క‌డా అన‌లేదు.

నీకు అన్నీ ముందే తెలుసుక‌దా.. తెలిసీ నువ్విచ్చే హామీల అమ‌లుకు జ‌నం ముందు ఒప్పుకుని మ‌రీ వాగ్దానం చేశావు. మ‌రిప్పుడెందుకు ఇలా వెంట‌నే యూట‌ర్న్ తీసుకోవ‌డం.. ఇది రాజ‌కీయాల్లో స‌రైన ప‌ద్ద‌తి కాదు.. మెళ‌కువ‌లు నేర్చుకో.. అప్పులు నువ్వ‌నుకున్నంత గంపెడు భార‌మేమీ కాదు.. ఆలోచిస్తే.. యుక్తి ప్ర‌ద‌ర్శిస్తే.. ఇంకాఅప్పులు చేయొచ్చు.. తీర్చొచ్చు.. ఇచ్చిన హామీలు నేర‌వేర్చేదిశ‌గా సాగొచ్చు.. అది ప్ర‌య‌త్నించు మొద‌లు..! అని హితోక్తి ప‌ల‌క‌డం బాగుంది. కానీ ఇక్క‌డ సీన్ రివ‌ర్స్ ఉంది. తెలంగాణ‌లో సీఎంగా కేసీఆర్ చేసిన అప్పుల‌కు జ‌వాబుదారీగా లేడు. తాను అన్ని అప్పులు చేయ‌లేదని వాదిస్తున్నాడు. కొన్నే చేశామ‌ని.. అదీ వీటి వీటికి చేశామ‌నే వాద‌న త‌ప్ప‌.. అప్పులు, అబ‌ద్దాల చుట్టే రాజ‌కీయం త‌ప్ప‌.. త‌మిళ‌నాట నేత‌ల మ‌ధ్య ఉన్న హుందాతనం ఇక్క‌డ లోపించింది.

Advertisement

ఈ సంక్షేమ ప‌థ‌కాలు, హామీలు ఎందుకు ఇబ్బ‌డిముబ్బ‌డిగా ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో ప్ర‌క‌టించాలె.. ఎందుకు అధికారంలోకి రాగానే అప్పుల విష‌యం తీసుకురావాలె..? దీన్ని ప్ర‌జ‌లు ఎలా చూస్తారు? ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌నే అంశం.. అంత‌టా చ‌ర్చ జ‌రుగుతోంది. విజ‌య్ సినీ చ‌రిష్మానే కాదు.. అక్క‌డ ఆయ‌న ఇచ్చిన హమీలు కూడా ఘ‌నంగానే ఉన్నాయి. కానీ వాటిని పెద్ద‌గా జ‌నం ప‌ట్టించుకున్న‌ట్టు లేరు. విజ‌య్‌ను గెల‌పించాల‌నే త‌ప‌నే ఎక్కువ జ‌నంలో ఉన్న‌ట్టుగా అనిపించింది. కానీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప‌క్క‌లో బ‌ల్లెంలా ఉన్న స్టాలిన్ వ‌ద‌లుతాడా? ఆరు నెల‌ల గడువిచ్చాడు. ఆ త‌రువాత ఉంటుంది అస‌లు రాజ‌కీయం.ఇక్క‌డ తెలంగాణ‌లో కూడా మొద‌లైంది. ఇచ్చిన హమీల అమ‌లుపై బీఆరెస్ ప్ర‌శ్నించ‌డం.

Related News

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

మీ అవినీతిని బంద్ పెడితే చాలు.. ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం అందించొచ్చు..!

నాన్న‌న‌నిన నేను నిన్న‌న‌నా..! న‌న్న‌నిన‌ నీ నాన్న‌ను నేన‌న‌నా?

ముళ్ల కుర్చీపై కూర్చున్న మ‌ల్ల‌న్న‌! బాస్‌ను తిట్టే తిట్ల‌న్నీ వింటూ ఓపిగ్గా భ‌రించిన మ‌ల్లారెడ్డి..!

Big Stories

Advertisement
×